విజయ్ దేవరకొండ ఆ ట్రాక్ నుండి తప్పించుకోలేకపోతున్నాడా? ఇలా అయితే కష్టమే…?

వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం తో ప్రేమికుల రోజున అభిమానులని పలకరించిన విజయ్ దేవరకొండ తన లవ్ ట్రాక్ ని మాత్రం వదలడం లేదని తెలుస్తుంది. అర్జున్ రెడ్డి చిత్రం తో స్టార్ హీరోల స్థాయి ని ఏర్పరుచుకున్న విజయ దేవరకొండ ఆ తర్వాత భిన్న కథాంశాలతో పలు సినిమాల్లో నటించారు. అయితే ప్రేక్షకులు మాత్రం విజయ్ యూత్ ఐకాన్ గా ఉంటూ, రొమాంటిక్, లవ్, యాంగ్రీ యంగ్ మ్యాన్ గా చూడటానికి అభిమానులు ఎక్కువగా ఇష్టపడ్డారు.

విజయ్ దేవరకొండ ఎంతో అద్భుతంగా నటించినప్పటికీ సినిమాలో లవ్ ట్రాక్ అన్ని సార్లు, అన్ని కథలకు సెట్ కాదనే విషయం విజయ్ ని చూస్తే తెలుస్తుంది. విమర్శకుల నుండి డియర్ కామ్రేడ్ చిత్రం ప్రశంసలు దక్కించుకున్నప్పటికీ హిట్ టాక్ సంపాదించలేకపోయింది. వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ తన మార్క్ నటనతో ప్రేక్షకుల్ని మరొకసారి థియేటర్ ల వైపు పరిగెత్తిస్తున్నాడు విజయ్. మరి ప్రేక్షకులు ఈ చిత్రానికి ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

error: Content is protected !!