ఇవాంక ట్రంప్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
ఇవాంకా ట్రంప్.. డొనాల్డ్ ట్రంప్ కుమార్తె. అంతేకాదు, అమెరికా అధ్యక్షుడైన తన తండ్రికి సలహాదారుగా కూడా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో జగిన గ్లోబల్ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్) 2017లో ఈమె పాల్గొంది. తరువాత పలు విందు కార్యక్రమాల్లోనూ ఆమె సందడి చేసింది. అయితే ఇవాంకా రాక ఏమోగానీ గత కొద్ది రోజుల నుంచి ఈమె నామ స్మరణే జరుగుతోంది. ఈ క్రమంలో మనకు ఇవాంక గురించి తెలిసింది చాలా తక్కువే. అసలు ఆమె ఏం చేస్తుంది ? ఆమె వ్యక్తిగత వివరాలు ఏంటి ? ఆమెకు ఉన్న కంపెనీలు ఏవి ? వంటి వివరాలు చాలా మందికి తెలియవు. వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
ఇవాంకా ట్రంప్ పుట్టింది 1981 అక్టోబర్ 30న. ఈమె తండ్రి పేరు డొనాల్డ్ ట్రంప్. తల్లి పేరు ఇవానా ట్రంప్. ఇవాంకా ట్రంప్ పుట్టిందే ధనికుడి ఇంట్లో అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవాంకా పుట్టేటప్పటికే ట్రంప్ బిలియనీర్‌గా ఉన్నాడు. ఎన్నో వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన కంపెనీలు ట్రంప్‌కు ఉన్నాయి. వాటిల్లో రియల్ ఎస్టేట్ కంపెనీ ఒకటి. ఇక ఇవాంకా భర్త పేరు జారెద్ కుష్నర్. ఈమె అమెరికన్ టెలివిజన్ పర్సనాలిటీగా పేరు పొందింది. అంతేకాదు, ఈమె రచయిత, ఫ్యాషన్ డిజైనర్ కూడా. మహిళా వ్యాపారవేత్తగా కూడా ఇవాంకా పేరుగాంచింది.
జార్జ్‌టౌన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలలో ఇవాంకా విద్యాభ్యాసం కొనసాగింది. ప్రస్తుతం ఈమె తన తండ్రి, అమెరికా అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్‌కు సలహాదారుగా పనిచేస్తోంది. అందుకోసం తన తండ్రి వ్యాపారాలను ఆమె వదిలిపెట్టింది. డొనాల్డ్ ట్రంప్ సంతానంలో అందరికన్నా ఇవాంకయే పెద్ద. ఈమెకు ఇవాంక ట్రంప్ కలెక్షన్ అనే సొంత పేరిట ఓ ఫ్యాషన్, లైఫ్ స్టైల్ కంపెనీ ఉంది. 2014లో ఫార్చూన్ మ్యాగజైన్ టాప్ 40 లిస్ట్‌లో ఈమెకు 33వ స్థానం లభించింది. 2015లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈమెను యంగ్ గ్లోబల్ లీడర్‌గా గుర్తించింది. 2017లో టైమ్స్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ వ్యక్తుల లిస్ట్‌లో ఈమెకు చోటు దక్కింది. కాగా ఇప్పుడు ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటనకు వచ్చింది. ఇక ఈమె మొత్తం ఆస్తి 300 మిలియన్ డాలర్లు ఉంటుంది..!