కూతుళ్లు చేసిన పనుల వల్ల పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన తండ్రులు వీరే..!
అప్పుడే ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే,ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉండకుండా ఉండదు. అయితే కొన్ని గొడవలు పెద్దవి అయిపోయి,పోలీస్ స్టేషన్ దాకా వెళ్తాయి. దీంతో స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి ఘటనలను పరిశీలిస్తే ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు. సెలబ్రిటీలు కనుక ప్రచారం కూడా జోరుగానే సాగిపోతుంది. ఇగో సమస్యలు,ఆస్తుల సమస్యల కారణంగా కూతుళ్లపైనే తండ్రులు కేసులు పెట్టిన సందర్భాలు ఇండస్ట్రీలో ఉన్నాయి. అలా కూతుళ్ళ వలన స్టేషన్ మెట్లెక్కిన వాళ్లెవరో వివరాల్లోకి వెళ్తే… మంజుల,విజయకుమార్ దంపతుల ముగ్గురు కూతుళ్లు హీరోయిన్స్ గా నటించి,పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయ్యారు.
అయితే పెద్దమ్మాయి వనితతో ఇంట్లో ఎప్పుడూ గొడవలే జరిగేవి. నా కొడుకుని నాకు కాకుండా చేసారని వనితా కేసు పెడితే,ఆమె వలన తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని విజయకుమార్ కేసు పెట్టాడు. ఇక ఇంట్లో ఉండడానికి వీల్లేదంటూ పోలీసుల సాయంతో గెంటేసాడు. ఇక రెండు పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ హీరో దునియా విజయ్ కేసులతో ఇబ్బంది పడ్డాడు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండవ భార్యను చేసుకున్నాడని మొదలైన సమస్య,కూతురిపై కేసు పెట్టేదాకా విజయ్ వ్యవహారం నడిచింది. తాను లేని సమయంలో తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లిందని కూతురిపై కేసు పెట్టాడు. తండ్రి తనను వేధిస్తున్నాడని కూతురు కూడా కేసు పెట్టేసింది.
తన కూతురు తనను చూసుకోవడం లేదని హీరోయిన్ లిజి తండ్రి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టగా, యితడు ఎవరో తెలీదని లిజి వాదన. ఇక సుమంత్ నటించిన ప్రేమకథ సినిమాతో తెలుగు తెరకు ఆంత్రమాలి పరిచయమైంది. అయితే ముసలి తనంలో తనను పట్టించుకోవడం లేదంటూ కూతురిపై తండ్రి కేసు పెట్టాడు. కోర్టు బయట ఈ కేసు సెటిల్ చేసుకున్నా,వ్యవహారం మాత్రం బాగా వైరల్ అయింది. అలాగే కుష్భు తన తండ్రిపై కోపాన్ని పబ్లిక్ గా చాలాసార్లు చెప్పుకొచ్చింది. కాగా తనను ఇంట్లోనుంచి వెళ్ళగొట్టాలని చూస్తోందని నటి సంగీత పై కన్నతల్లి కేసు పెట్టింది.