డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ హీరో ఎవరో తెలుసా ?

పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘బద్రి’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన పూరీ జగన్నాథ్‌ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఆ తర్వాత చేసిన ‘బాచి’ సినిమాతో ఫ్లాప్ మూట గట్టుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడిగా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసాడు. అయితే ఆతర్వాత హిట్ మూవీస్ చేసి తన సత్తా చాటాడు. ప్రస్తుతం పూరీ విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ అనే ప్యాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నాడు. నిజానికి దర్శకుడిగా పవన్ కళ్యాణ్‌తో సినిమా కంటే ముందు పూరీ జగన్నాథ్ మరో హీరోతో సినిమా స్టార్ట్ చేసాడట.

అవును సూపర్ స్టార్ కృష్ణతో 1996లో ఒక సినిమా మొదలు పెట్టాడట. ఆ సినిమా అనుకున్న సమయానికే పూర్తి చేసినా ఏవో కారణాల వల్ల రిలీజ్ కాలేదట. ఈ రకంగా మొదటి సినిమా విడుదల కాలేకపోయినా.. పవన్ కళ్యాణ్‌తో ‘బద్రి’ సినిమాతో మొదటిసారిగా సిల్వర్ స్క్రీన్ పై దర్శకుడిగా తన పేరును చూసుకున్నాడు. ఇక సూపర్ స్టార్ కృష్ణతో సినిమా విడుదల అవ్వకపోయినా, ఆయన తనయుడు మహేష్ బాబుకు మాత్రం ‘పోకిరి’ వంటి బ్లాక్ బస్టర్‌ హిట్ అందించాడు. ఆ తర్వాత ‘బిజినెస్ మేన్’ వంటి డిఫరెంట్ మూవీ చేసాడు.

ఇక తర్వాత కొన్ని ప్లాపులు మూటగట్టుకోవడంతో పూరి పని అయిపోయిందని అనుకున్నారు. అయితే గతేడాది రామ్‌తో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మరోసారి దర్శకుడిగా సత్తా చాటాడు. అంతేకాదు ముచ్చటగా మహేష్ బాబుతో మూడో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు మరోసారి పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మొ త్తంగా కెరీర్‌లో ఎన్నో అప్స్ డౌన్స్ చూసిన పూరీ అప్ అండ్ డౌన్స్ చూస్తూ తన ఇమేజ్ డామేజ్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడని చెప్పాలి.