TOP Position లో ఉండాల్సిన రాజశేఖర్ Down Fall కి 4 కారణాలు
తెలుగు ఇండస్ట్రీలో అన్ని రకాల మూవీస్ చేస్తూ,అవార్డులు సైతం సొంతంచేసుకుని స్టార్ డమ్ తెచ్చుకున్న డాక్టర్ రాజశేఖర్ 1985లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి నెగెటివ్ క్యారెక్టర్స్ చేసి అలరించి,తరువాత హీరోగా ఒక్కో మెట్టు ఎక్కి అశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు. అంకుశం మూవీతో సెన్షేషనల్ హీరో గా తనకంటూ బిగ్గెస్ట్ హిట్ తెచ్చుకున్నాడు. ఓ పక్క చిరంజీవి,మరోపక్క బాలయ్య స్టార్ హీరోలుగా రాణిస్తుంటే, మూడో హీరోగా రాజశేఖర్ గుర్తింపు తెచ్చుకున్నాడు.
మగాడు,రౌడీయిజం నశించాలి,అన్నయ,మనసున్న మారాజు,ఆగ్రహం,శివయ్య,సూర్యుడు,సింహరాశి, లాంటి హిట్స్ కొట్టిన డాక్టర్ రాజశేఖర్ కి 1997నుంచి తేడా కొట్టింది. వరుస పరాజయాలతో దెబ్బతిన్నాడు. 2001తో బాగా డౌన్ అయ్యాడు ఎవడైతే నాకేంటి తో పర్వాలేదని అనిపించినా మళ్ళీ , గరుడ వేగ వరకూ ఒక్క హిట్ లేదు. ఇక సాధించేది ఏదీలేదు. అయితే 1997 నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ కావడానికి ప్రధాన కారణంగా కొన్ని అంశాలు చెబుతారు.
అప్పటివరకూ డాక్టర్ రాజశేఖర్ కి సాయికుమార్ డబ్బింగ్ చెప్పేవాడు. అది రాజశేఖర్ ఓన్ వాయిస్ అనుకున్నారు. అయితే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోలేకపోవడం ఓ మైనస్ పాయింట్. కానీ ఆతర్వాత నుంచి శ్రీనివాస మూర్తి,సాయికుమార్ తమ్ముడు డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసారు. అప్పటికే విన్న వాయిస్ కి దీనికి తేడా రావడంతో జనానికి నచ్చలేదు. దానికి తోడు సాయికుమార్ డబ్బింగ్ ఉంటేనే సినిమాలు చేస్తామని ప్రొడ్యూసర్స్ చెప్పేసారు. కానీ తమిళియన్ అని తేడా రావడంతో ఫాన్స్ తగ్గిపోయారు. జెంటిల్ మేన్,సూర్యవంశం,ఠాగూర్ లాంటి సినిమాలు డాక్టర్ రాజశేఖర్ వివిధ కారణాల వలన చేజారాయి. ఇక వారసుల హవా రావడంతో మరింత దెబ్బ తగిలింది.