Movies

థియేటర్స్ ఫార్మాట్ ఛానెల్స్ ఫాలో అవుతున్నాయా?

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా మన దేశం అంతా స్థంభించుకుపోయింది. దీనితో అనేక ఎంటెర్టైనెంట్ వీక్షకులకు వెండితెర మీద తమ ఎంటెర్టైనెంట్ ను బాగా మిస్సవుతున్నారు. అయితే ఈ లోటును డిజిటల్ యాప్స్ మరియు మన ఛానెల్స్ తీరుస్తున్నాయి. అయితే ఈ కరోనా వైరస్ వ్యాప్తికి ముందు మన రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ప్రతీ శుక్రవారం సరికొత్త సినిమాలతో తమ వీకెండ్ ను గడుపుతుంటారు.

కానీ ఇప్పుడు థియేటర్స్ లో ఆ ఛాన్స్ మిస్సయినా ఆ లోటు మన తెలుగు ఛానెల్స్ తీరుస్తూ ఈ ఫ్రైడే ఫార్మాట్ ను ఫాలో అవుతున్నారని చెప్పాలి. ఈరోజు శుక్రవారం కారణంగా స్టార్ మా లో “వదలడు” టెలికాస్ట్ చేయనుండగా వచ్చే శుక్రవారం జెమినిలో “దర్బార్” ప్రసారం కానుంది. మాములుగా అయితే ప్రతీ ఆదివారం ఇలా ప్లాన్ చేసేవారు. కానీ ఇప్పుడు శుక్రవారం ఫార్మాట్ లోకి వచ్చేసారు. మరి ఇది ఎంత వరకు కంటిన్యూ అవుతుందో..