Movies

నితిన్ “భీష్మ” స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా?

టాలీవుడ్ టైర్ 2 టాప్ హీరోల్లో నితిన్ కూడా ఒకరు. అయితే నితిన్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “భీష్మ”. ఈ చిత్రం నితిన్ కెరీర్ లోనే మోస్ట్ అవైటెడ్ గా మారింది. దానికి తోడు వెంకీ కూడా ఈ చిత్రాన్ని మంచి ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించడంతో నితిన్ అభిమానులకు సహా ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా బాగా కనెక్ట్ అయ్యింది.

దీనితో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నితిన్ కు మరో సాలిడ్ హిట్ ను అందించింది. అయితే థియేటర్స్ లో ఈ సినిమా సందడి ముగిసిపోయాక డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూసారు. అయితే ఇప్పుడు తరుణం వచ్చేసింది. ఈ సినిమాను సన్ నెక్స్ట్ వారు ఈ ఏప్రిల్ 24 న డిజిటల్ ప్రీమియర్ గా అందుబాటలులోకి తీసుకురానున్నట్టు అధికారికంగా వెల్లడి చేసారు. ఈ సినిమా కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు మీ టైం వచ్చేసింది.