పసివాడి ప్రాణం సినిమా వెనక కొన్ని నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో
స్వయంకృషితో తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ఎందరికో స్ఫూర్తి. ఒకసారి చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ కి వెళ్తే, అప్పుడప్పుడే సుప్రీమ్ హీరో స్థాయి నుంచి మెగాస్టార్‌గా ఎదుగుతున్న రోజుల్లో చిరు నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేసేవి. ఓ వైపు సూపర్ స్టార్ కృష్ణ బాక్సాఫీస్‌పై దాడి చేస్తుంటే.. ఆయన ధాటిని తట్టుకుని నిలబడి చిరంజీవి దూసుకుపోతున్నాడు. అప్పటికే ఖైదీ, విజేత, మగమహారాజు, శుభలేఖ, ఇంట్లో రామయ్య వీధిలోకృష్ణయ్య లాంటి చాలా విజయాలు అందించాడు.
అలాంటి సమయంలో పసివాడి ప్రాణం మూవీ రిలీజయింది. మలయాళం సినిమాకు రీమేక్‌గా కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో అఖండ విజయం సాధించింది.అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తుడిచేసి కొత్త ఇండస్ట్రీ హిట్‌గా ఈ మూవీ నిలబడింది. చిరంజీవి, విజయశాంతి కెమిస్ట్రీ ఈ మూవీలో బాగా వర్కౌట్ అయింది. ఇక బాలనటి సుజీత పర్ఫార్మెన్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. రఘువరన్ విలనిజం పండించాడు. మొత్తం మీద ఇవన్నీ కల్సి పసివాడి ప్రాణం సినిమాను ఇండస్ట్రీ హిట్ చేసాయి.
1987లో పసివాడి ప్రాణంవిడుదలైంది. అప్పట్లోనే ఈ చిత్రం 4.8 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక అప్పటి వరకు తెలుగు ఆడియన్స్ చూడని డాన్సులను చూపించాడు మెగాస్టార్. అందుకే ఈ సినిమాలో చిరంజీవి బ్రేక్ డాన్సులు హైలైట్ అయ్యాయి. ఆ సినిమా 100 రోజుల వేడుక కూడా భారీగానే జరిగింది.దానికి అప్పట్లో చిరంజీవి సరసన వరస సినిమాలు చేస్తున్న భానుప్రియ, విజయశాంతి, రాధవచ్చారు. వాళ్లందరి చేతుల మీదుగా 100 రోజలు షీల్డ్ మెగాస్టార్ అందుకున్నాడు . అప్పటికే రాధ, భానుప్రియతో పాటు విజయశాంతితో చిరంజీవిది సూపర్ హిట్ కాంబినేషన్. దీంతో ఇప్పటికీ ఫాన్స్ కి ఇదో మధురమైన మెగా జ్ఞాపకమే.