Movies

సూపర్బ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్న తెలుగు టాప్ యాంకర్స్.!

ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాలు స్తంభించిపోయాయి. దీనితో జనం అంతా ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని పాతవి అయినా చూస్తున్నారు. కానీ తమను ఇంత వరకు ఆదరించిన మన తెలుగు యాంకర్స్ మాత్రం తమ అభిమానుల కోసం తమ వంతుగా కొత్త ప్రయోగాలతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అలా ఇప్పుడు తెలుగు బుల్లితెర టాప్ ఫిమేల్ యాంకర్ సుమ, అలాగే జబర్దస్త్ ఫేమ్ అనసూయ మరియు రష్మీ అలాగే యూతు లో మంచి క్రేజ్ ఉన్న యాంకర్ ప్రదీప్ అలాగే రవిలు మొత్తం వీరంతా కలిసి ఒక చిన్నపాటి ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ ను ప్లాన్ చేసారు.

“సుమ సూపర్ 4” అనే టైటిల్ తో ప్లాన్ చేసిన ఈ ఎపిసోడ్ ను ఎంతో ఇష్టపడి తమ వీక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించేందుకే చేసాం అని అలాగే ఈ వీడియోను కోవిడ్ చారిటీకు అంకితం ఇస్తున్నామని సుమ తెలిపారు. అలాగే ఈ వీడియో సాధ్యం అయ్యేలా చేసిన ప్రదీప్,అనసూయ,రష్మీ మరియు రవిలకు స్పెషల్ థాంక్స్ తెలుపుతున్నా అని సుమ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసారు. ఈ వీడియోను రేపు శనివారం సాయంత్రం 5 గంటలకు విడుదల చెయ్యబోతున్నట్టుగా తెలిపారు.