Movies

రిటైర్‌మెంట్ త‌ర‌వాత రాజ‌మౌళి ఏమి చేస్తాడో తెలుసా?

సినిమాల నుంచి రిటైర్ అయ్యాక ఏం చేయాల‌న్న విష‌యంలో కొంత‌మంది ద‌ర్శ‌కులు అప్పుడే భారీగా ప్లానింగులు చేసుకుంటున్నారు. మ‌రో ఐదేళ్ల త‌ర‌వాత రిటైర్ అయిపోతాన‌ని, ఆ త‌ర‌వాత ఎక్కువ భాగం ప్ర‌జా సేవ‌లోనే గ‌డుపుతాన‌ని ఇటీవ‌ల కొర‌టాల శివ ప్ర‌క‌టించారు. ఇప్పుడు రాజ‌మౌళి కూడా రిటైర్‌మెంట్ త‌ర‌వాత రోజుల గురించి ఆలోచన‌లో ప‌డ్డాడు. ప‌దేళ్ల వ‌ర‌కూ రిటైర్‌మెంట్ ఆలోచ‌న లేదంటున్న రాజ‌మౌళి, ఆ త‌ర‌వాత ఏం చేయాల‌న్న విష‌యంపై ఇప్పుడే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశాడు.

నల్గొండ జిల్లాలో ఈదులూరు అనే ఓ గ్రామం ఉంది. అక్క‌డ రాజ‌మౌళి కుటుంబం భారీగా పొలాల్ని కొనుగోలు చేసింది. అక్క‌డో ఫామ్ హోస్ లాంటిది ఏర్పాటు చేసుకున్నారు. నెల‌కోసారి అక్క‌డ‌కు వెళ్లి, స‌ర‌దాగా గ‌డిపిరావ‌డం అల‌వాటు. రాజ‌మౌళి కుటుంబానికి సంబంధించిన ఏ వేడుక అయినా అక్క‌డే జ‌రుగుతుంది. ప‌దేళ్ల త‌ర‌వాత‌.. కుటుంబం మొత్తం అక్క‌డే స్థిర‌ప‌డాల‌ని నిర్ణ‌యించుకున్నార్ట‌. కీర‌వాణి, విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌, కల్యాణీ మాలిక్‌.. ఇలా రాజ‌మౌళి కుటుంబం అంతా ఒకే చోట స్థిర‌ప‌డ‌బోతోంద‌ని తెలుస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."