Movies

పొలిటికల్ బాంబు పేల్చిన చిరు..ఆ అభిమానుల పరిస్థితి ఏంటో.!

రాజకీయ పరంగా చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ల దారులు వేరు అయినా గమ్యం మాత్రం ఒకటే అని మెగాస్టార్ చిరంజీవి వెలిబుచ్చారు. ఇప్పుడు లాక్ డౌన్ లో తన అభిమానులతో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటున్న మెగాస్టార్ రాజకీయ జీవితం కోసం కొత్తగా తెలుగు ప్రజలకు చెప్పనవసరం లేదు.అలాగే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు జనసేన పార్టీ స్థాపించి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో కూడా అందరికీ తెలిసిందే.

అయితే ఇటీవలే సోషల్ మీడియాలో కి వచ్చిన చిరు అనేక విషయాలను పంచుకుంటున్నారు.అయితే గత కొన్ని నెలల కితం వరకు చిరు రాజకీయాలపై ఏదొక వార్త హాట్ టాపిక్ అవుతూ వచ్చేవి. ఇప్పుడు వాటన్నిటికీ ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ద్వారా ఏపీ రాజకీయ వర్గాల్లో మరియు చాలా మంది మెగా అభిమానులకు ఒక క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇచ్చేసారు.

పొలిటికల్ గా ఇప్పుడు తనతో పాటుగా తన కుటుంబం అంతా పవన్ తోనే ఉన్నామని ఉంటామని ఇందులో ఎలాంటి సందేహమూ లేదని ఇటీవలే ఇచ్చిన ఒక తాజా ఇంటర్వ్యూ ద్వారా తేల్చి చెప్పి కొంత మంది సో కాల్డ్ మెగా ఫ్యాన్స్ విషయంలో బాంబు పేల్చారు.దీనితో సోషల్ మీడియాలో కేవలం మెగాస్టార్ ఫ్యాన్స్ మేము అని చెప్పి ఇతర పార్టీలకు మద్దతు పలికే వారికి పెద్ద సమస్యే వచ్చి పడింది అని చెప్పాలి.మరి ఇప్పుడు నైతికంగా వారు ఎవరికి సపోర్ట్ చేస్తారో..?

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."