Movies

బాహుబలితో పెళ్లిపై మెగా డాటర్ క్లారిటీ…రూమర్స్ రావటానికి కారణం ఇదే…!

ఇండస్ట్రీలో అందునా తెలుగులో అగ్ర హీరోల ఫ్యామిలీ నుంచి హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడం అంటే ఆషామాషీ వ్యవహారం కానేకాదు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ లో మరీను. అయితే మెగా ఫామిలీ నుంచి హీరోలే కాదు హీరోయిన్ కూడా ఉందని నిహారిక ధైర్యం చేసింది. గ్లామర్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఇప్పుడు నిహారిక కూడా ప్రయత్నాలు సాగిస్తోంది. ఇక్కడ అవకాశాల రావాలంటే కచ్చితంగా అందాలు ఆరబోయాలని నిహారికకు తెలుసు కాబట్టే, అందుకు సిద్ధమైంది. మెగా వారింటి ఇమేజ్ ఉన్నా కూడా దాన్ని పక్కనబెట్టి తను కూడా అప్పుడప్పుడూ హీరోయిన్ మాదిరే అందాల ఆరబోత చేయడానికి ఈ ముద్దుగుమ్మ వెనుకాడడం లేదు.

చాలా వరకు ప్రతీ సినిమాలో కూడా పద్దతిగానే కనిపించిన నిహారిక, బయట మాత్రం హాట్ హాట్‌గా దర్శనమిస్తుంది. మొన్నామధ్య బీచ్‌లో రెచ్చిపోయిన నిహారిక.. ఇప్పుడు మళ్ళీ రెచ్చిపోయింది. అంతేకాదు, ఇకపై కూడా ఇదే చేస్తానని చెప్పింది. ఇప్పట్నుంచి తాను మోడ్రన్ డ్రస్‌లో కనిపిస్తానని.. రొమాంటిక్ రోల్స్ కూడా చేస్తానని చెబుతుంది. నిజానికి తన తర్వాతి సినిమాలో పూర్తి రొమాంటిక్ రోల్ చేస్తున్నట్లు ఫాన్స్ తో పంచుకుంది. తెలుగులో ఆచార్య సినిమాలో చిన్న పాత్రలో నటించబోతుంది. ఇక పెళ్లి గురించి కూడా ఇప్పుడు ఫ్యాన్స్ ఈమెను కొన్ని ప్రశ్నలు అడిగారు . కొన్ని రోజులుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. సింపుల్‌గా వెబ్ సిరీస్‌లు చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది.

కొన్ని రోజుల కింద ప్రభాస్‌తో నిహారిక పెళ్లి అంటూ వార్తలొచ్చాయి. ఇదే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగాడు. ‘ప్రభాస్‌ను ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నారా అక్క’ అని అడిగితే.. ‘నేను ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడం ఏంటండి.? ఆయనెక్కడ.? నేనెక్కడ.?’ అంటూ నిహారిక షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. అలాంటి రూమర్స్ ఎలా వస్తాయో తెలియదంటుంది . గతంలో కూడా సాయి ధరమ్ తేజ్‌తో పెళ్లి అంటూ రూమర్స్ వచ్చాయి. మొత్తానికి ప్రభాస్‌తో పెళ్లనేది ఉత్తిదేనని తేల్చేసింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."