Movies

పుష్ప కోసం విజయ్ సేతుపతి ఎన్ని కోట్లు డిమాండ్ చేసాడో తెలిస్తే షాక్ అవుతారు

టాలీవుడ్ ప్రముఖుడు దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం “పుష్ప” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తుండగా కన్నడ భామ అ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రంలో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నాడు.ఇప్పటికే ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్రకు సంబంధించి నటువంటి మాస్ లుక్ పోస్టర్లు విడుదల చేయగా మంచి స్పందన లభించింది.

అయితే ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ మధ్యకాలంలో ఈ విషయానికి సంబంధించినటువంటి పలు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటించడం కోసం దాదాపుగా పది కోట్ల రూపాయను పారితోషికం డిమాండ్ చేసినట్లు సమాచారం.దీంతో చిత్ర యూనిట్ సభ్యులు విజయ్ సేతుపతిని తీసుకోవాలా, వద్దా అనే సందిగ్ధంలో పడ్డారట.

కానీ ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పాత్ర కీలకం కావడంతో అల్లు అర్జున్ ఖచ్చితంగా విజయ్ సేతుపతిని తీసుకోవాలని చిత్ర యూనిట్ సభ్యులకు సూచించాడట. అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో విజయ్ సేతుపతి ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు కూడా పలు వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పటి వరకు ఈ వార్తలపై చిత్ర యూనిట్ సభ్యులు స్పందించలేదు.దీంతో పుష్ప చిత్రంలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడనే ఈ విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు.కనీసం ఇప్పటికైనా చిత్ర యూనిట్ సభ్యులు స్పందించి విజయ్ సేతుపతి పాత్ర పై క్లారిటీ ఇస్తే బాగుంటుందని అల్లు అర్జున్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ విషయంపై పుష్ప చిత్ర యూనిట్ సభ్యులు స్పందిస్తారో లేదో చూడాలి.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి చిత్రీకరణ పనులు కేరళ రాష్ట్రంలో జరుగుతుండగా లాక్ డౌన్ కారణంగా కొంత కాలం పాటు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు చిత్ర యూనిట్ సభ్యులు నిలిపివేశారు.లాక్ డౌన్ ముగిసిన అనంతరం యధావిధిగా షూటింగ్ పనులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."