Movies

నవదీప్ పరిస్థితి ఇలా కావటానికి కారణం ఎవరో తెలుసా?

తెలుగులోనే కాకుండా మిగిలిన భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉన్న నవదీప్ 16 ఏళ్ల కింద తేజ తెరకెక్కించిన జై సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు హీరోగా చేసాడు. చందమామ లాంటి ఒకట్రెండు సినిమాలు మినహా పెద్దగా విజయం సాధించక పోవడంతో ఆర్య 2 లాంటి సినిమాలతో సపోర్టింగ్ రోల్స్ స్టార్ట్ చేసాడు. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు.. హిందీలో ఓ వెబ్ సిరీస్.. తెలుగులో కొన్ని సినిమాలు చేస్తున్నట్లు హీరో కమ్ విలన్ నవదీప్ చెప్పాడు . మొత్తానికి తాను మంచోన్నని మరోసారి చెప్పుకొచ్చాడు. ఇక సినిమాలతోనే కాదు వివాదాలతో కూడా బిజీగా ఉంటాడు. ఆ మధ్య గే వార్త కూడా బాగానే వైరల్ అయింది.

ముఖ్యంగా తను చాలా మంచోన్నని.. అనవసరంగా మీడియానే తనను ఫోకస్ చేసి చెడ్డోడిగా చిత్రీకరించిందని నవదీప్ ఓ ఇంటర్యూలో చెప్పాడు . గతంలో చేసిన కొన్ని తెలిసీ తెలియని తప్పులను ఫోకస్ చేసి చూపించిందన్నాడు. అయితే బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తానేంటో అందరికీ అర్థమైపోయిందని, అందుకే మంచోడిగా గుర్తిస్తున్నారని నవదీప్ చెప్పాడు. నిజానికి గే అనే వార్త కూడా కావాలనే పుట్టించారని సీరియస్ అయ్యాడు. అప్పట్లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అని.. తనను తప్పుగా అనుకోవద్దు అంటూనే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానని చెప్పాడని తెలిపాడు. అడుగు అనగానే.. మీకు అబ్బాయిలంటే బాగా ఇష్టమట కదా.. నాకు అంతే.. మీతో చాలా మాట్లాడాలి.. నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలని ఉందని బాంబ్ పేల్చాడని చెప్పాడు.

దానికి తాను కూడా వెంటనే రియాక్ట్ అయ్యానని.. తనకు ఆసక్తి లేదని.. నేనే గే ఏంట్రా అని చెప్పినట్లు చెప్పాడు. వాస్తవానికి సినిమాల్లో చూపించినట్లు గే లు బయట ఉండరని, సినిమాల్లో కేవలం కామెడీ కోసమే అలా చూపిస్తారని నవదీప్ చెప్పుకొచ్చాడు. బయట వాళ్ల లైఫ్ స్టైల్ వాళ్లకు ఉంటుందన్నాడు. తన కెరీర్ ప్రస్తుతం పీక్స్‌లో ఉందని నమ్ముతున్నట్లు చెప్పాడు . కెరీర్‌లో కాస్త సెటిల్ అయి.. ఆర్థికంగా నిలబడిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాగానే బిజీ అయిపోయాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."