Movies

జబర్దస్త్ నరేష్‌ గురించి ఈ నమ్మలేని నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

మోస్ట్ టి ఆర్ పి రేటింగ్ గల జ‌బ‌ర్ద‌స్త్ షోలో ఎందరో ఆర్టిస్టులు తమ సత్తా చాటుతూ,ఆర్థికంగా కూడా నిలబడ్డారు. ఇక తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని కుర్ర కమెడియన్ నరేష్ ఉరఫ్ నాటి నరేష్ దూసుకుపోతున్నాడు. చూడ్డానికి మిర‌ప‌కాయ్‌లా ఉన్నా కూడా ఆయ‌న కామెడీ మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. తనదైన పంచులతో పిచ్చెక్కిస్తుంటాడు. మూడడుగులే ఉంటాడు కానీ మిగిలిన టీం లీడర్స్‌కు తన టైమింగ్‌తో ముచ్చెమటలు పట్టిస్తుంటాడు. అలాంటి నాటి నరేష్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి.

వరంగల్ జిల్లా జనగాం దగ్గర్లోని అనంతపురం అనే ఊళ్లో పుట్టిన నరేష్, చిన్నప్పటి నుంచే ఎదుగుదల లోపంతో బాధ పడుతున్నాడు. కానీ అదే అతడికి ఇప్పుడు వరమైంది. పదేళ్ల పిల్లాడిలా కనిపిస్తుంటాడు కానీ నరేష్ వయసు మాత్రం 20 ఏళ్లు. 2000 సంవత్సరంలో పుట్టిన నరేష్, ముఖ్యంగా చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఆసక్తి చూపించేవాడు. ఈటీవీలో ఢి షోకు ఎంపికయ్యాడు. అక్కడ్నుంచి ఈ కుర్రాడి ప్రయాణం మొదలైంది. ఢీ షో జూనియర్స్‌కు వచ్చాడు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌ బయటే తిరుగుతుంటే సునామీ సుధాకర్ చూసి చంటి టీంలో జాయిన్ చేసాడు.

ఆతరువాత ఆ టీం నుంచి బుల్లెట్ భాస్కర్ టీంలోకి వచ్చిన తర్వాత నరేష్ జాతకం మారిపోయింది. అక్కడే అతడు స్టార్ అయిపోయాడు. ముఖ్యంగా తనదైన పంచులతో పిచ్చెక్కించాడు. జబర్దస్త్ కోసం అంతా స్కిట్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు.. కానీ నరేష్ మాత్రం చేయడు. ఒక్కసారి స్క్రిప్ట్ ఏంటి, స్కిట్ స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ ఏంటి అనేది మాత్రమే గుర్తు పెట్టుకుని స్టేజ్‌పై పర్ఫార్మ్ చేస్తుంటాడు. ఇది నిజంగా అరుదైన టాలెంట్ అంటూ భాస్కర్ కూడా చాలాసార్లు చెప్పాడు. నరేష్ వల్లే తమ టీంకు అంతమంచి పేరొచ్చిందని చెప్తుంటాడు ఆయన. ఒక్క టీం అనకుండా అందరి టీంలలో కనిపిస్తుంటాడు. జబర్దస్త్ షోలోకి వచ్చాక సొంతూళ్లో ఇల్లు కట్టుకున్నాడు. సిటీలో కూడా ఫ్లాట్ తీసుకున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."