Movies

లాక్ డౌన్ సమయంలో “అమెజాన్ ప్రైమ్” వ్యూవర్ షిప్ ఎంత పెరిగిందో…!

ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పాటుగా మన దేశం కూడా లాక్ డౌన్ పాటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనితో ఈ లాక్ డౌన్ లో స్ట్రీమింగ్ రంగం బాగా అభివృద్ధి చెందింది. అలా మనదేశంలో అత్యంత పాపులర్ అయిన అమెజాన్ ప్రైమ్ వ్యూవర్ షిప్ భారీ ఎత్తున పెరిగినట్టు తెలుస్తుంది. మామూలుగానే అమెజాన్ ప్రైమ్ కు మనదేశంలో మంచి క్రేజ్ ఉంది.

అది ఇప్పుడు ఈ లాక్ డౌన్ సమయంలో మరింత స్థాయిలో పెరిగినట్టు తెలుస్తుంది. మన దేశంలో ఈ లాక్ డౌన్ మొదలయ్యినప్పటి నుంచి అమెజాన్ ప్రైమ్ ను వినియోగించే వినియోగదారులు సగటున 83 శాతం పెరిగారట. దీనితో ఇతర స్ట్రీమింగ్ యాప్స్ తో పోలిస్తే అమెజాన్ ప్రైమ్ లోని వ్యూ శాతం పెరిగింది. మొత్తానికి మాత్రం ఈ లాక్ డౌన్ సమయంలో అమెజాన్ ప్రైమ్ కు బాగానే కలిసొచ్చింది అని చెప్పాలి.