మెగా మేనల్లుడు సాయి ధర్మ తేజ్ ఆస్థి విలువ ఎంతో తెలుసా?
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో సాయి ధర్మ తేజ్ ఒకడు. మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడైన సాయి తేజ్ పాపులార్టీ ,స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. పిల్లా నువ్వు లేని జీవితం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.మధ్యలో కొంచెం డౌన్ అయినా, చిత్రలహరి తో హిట్ కొట్టి,పండగ చేస్కో మూవీతో మరో హిట్ అందుకున్న సాయి తేజ్ ఇప్పటి దాకా 12సినిమాలకు పైగా నటించాడు. స్వయంగా కష్టపడి తను ఓ స్టార్ హీరో అనిపించుకోవాలని తపించడమే ఇతని నిజమైన ఆస్థి అంటారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు.
అయితే ఇంతగా పాపులార్టీ గల సాయి తేజ్ ఆస్తి ఎంత, ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటాడు వంటి విషయాల్లోకి వెళ్తే, ఇతడి ఆస్థి 75కోట్లు. ఒక్కో సినిమాకు2నుంచి 3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ఏడాదికి 5నుంచి 7కోట్లు సంపాదిస్తాడు. నాలుగు కోట్ల విలువ చేసే ఇల్లు,రెండు అత్యాధునిక కార్లు ఉన్నాయి.