లాక్ డౌన్ సమయంలో డైరెక్టర్ తేజ ఏమి చేస్తున్నాడో చూడండి
కరోనా మహమ్మారితో వచ్చిన లాక్ డౌన్ తో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. సెలబ్రిటీలు కూడా షూటింగ్స్ క్యాన్సిల్ కావడంతో ఇంటిపట్టునే ఉంటున్నారు. ఇక షూటింగ్స్ లేకపోవడంతో టైం పాస్ చేయడానికి నానా ఇబ్బందులు పడుతూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నెట్టుకొస్తున్నారు. అయితే కొద్ది మంది మాత్రం ఈ సమయాన్ని కొత్త మార్గాలవైపు మళ్లిస్తూ, సరైన రీతిలో వినియోగించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్పానిష్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నట్లు చెప్పగా మరికొందరు మరికొన్ని రకాల కోర్సులను నేర్చుకుంటున్నారు.
దర్శకుడు తేజ ప్రస్తుతం రెండు సినిమాలను లైన్ లో పెట్టిన ఈ దర్శకుడు లాక్ డౌన్ ముగిసిన వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయాలి. గోపీచంద్ తో ఒక సినిమా, రానాతో మరో సినిమా తేజ ప్లాన్ చేస్తున్నాడు. ఈరెండు సినిమాలకు తేజ ఇప్పటికే టైటిల్స్ రిజిస్ట్రర్ చేయించడం, వాటిని ప్రకటించడం కూడా జరిగింది.
తాజాగా ఒక ఇంగ్లీష్ డైలీతో దర్శకుడు తేజ మాట్లాడుతూ ఆన్ లైన్ లో కోర్సు నేర్చుకుంటున్న ట్లు చెప్పాడు. ఆన్ లైన్ లో డబ్ల్యూహెచ్ఓ వారు నేర్పించే వైరస్ లకు సంబంధించిన క్లాస్ లను తేజ వింటున్నాడట. ఈ వయసులో దర్శకుడు తేజ చూపిస్తున్న ఆసక్తిని నిజంగా అభినందించాల్సిందే. ఇదే అదనుగా తేజ ప్రస్తుతం కరోనా వైరస్ పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించిన విషయాలపై అధ్యయనం చేస్తున్నట్లు టాక్. పెద్ద ఎత్తున వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అసలు వైరస్ ఎక్కడ పుట్టింది.. ఆ వైరస్ వ్యాప్తికి కారణం ఏంటీ ఎన్ని రకాల వైరస్ లు ఉన్నాయనే విషయమై తేజ ఆన్ లైన్ ద్వారా నేర్చుకుంటున్నాడట.