Movies

రవితేజ Kick 2 ప్లాప్ అవ్వటానికి కారణం హీరోనా…దర్శకుడా…అసలు నిజం

సాధారణంగా ఒక బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా వచ్చిన సినిమాలు అంతగా సక్సెస్ కావనే సెంటిమెంట్ టాలీవుడ్ లో బలంగా ఉంది. అప్పుడెప్పుడో వర్మ నిర్మాతగా తీసిన మనీ నుంచి పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ దాకా ఎన్నో దీనికి ఉదాహరణలుగా నిలిచాయి. ఒక్క బాహుబలి మాత్రమే దీనికి ఎదురీది ఇండస్ట్రీ రికార్డులు సాధించింది. కాని ఇది పోలీకలకు అతీతంగా నిలిచే ఫాంటసీ మూవీ కాబట్టి పరిగణనలోకి తీసుకోలేం. కమర్షియల్ సినిమాల లెక్కల్లో చూస్తే సీక్వెల్ అనేది తెలుగు వరకు చేదుమాత్రగానే నిలిచిపోయింది.

2015లో వచ్చిన కిక్ 2 గురించి రవితేజ అభిమానులు అందుకే అంత ఈజీగా మర్చిపోలేరు. దానికి సరిగ్గా ఆరేళ్ళ ముందు వచ్చిన కిక్ ఎంత పెద్ద బ్లాక్ బస్టరో అందరికి తెలిసిందే. మాస్ రాజాను దర్శకుడు సురేందర్ రెడ్డి డిఫరెంట్ గా చూపించిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తమన్ కు దీని రూపంలోనే పెద్ద బ్రేక్ దొరికింది. ఇంకేముంది కొనసాగింపు అనగానే అంచనాలు పెరిగిపోయాయి. కథకుడు వక్కంతం వంశీ స్క్రిప్ట్ తయారవుతున్నన్ని రోజులు దీని మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇండస్ట్రీలో ఉన్న నెగటివ్ సెంటిమెంట్ ని ఇది బ్రేక్ చేసి తీరుతుందన్న భరోసా ఇచ్చేశారు. కాని తెరమీదకు వచ్చేటప్పటికి ఎందుకో నిజాయితి తగ్గిందనిపించింది.

స్టొరీలో కీలకమైన విలేజర్స్ లో ఏదైతే ఎమోషన్ ని ఆశించారో అది పూర్తిగా ఇవ్వలేకపోవడంతో ఆడియన్స్ ఆ భావోద్వేగాన్ని ఫీల్ కాలేకపోయారు. దాంతో హీరో ఎంత వీరోచితంగా సమస్యల మీద పోరాడుతున్నా అదంత ఎఫెక్ట్ ఇవ్వలేకపోయింది. లుక్స్ పరంగా రవితేజ కొత్తగా ఉన్నప్పటికీ కిక్ టైటిల్ తో రావడం కూడా అంచనాలను పక్కదారి పట్టించింది. దీంతో మొదటి భాగంలోని ఎనర్జీకి డబుల్ ఊహించుకున్న వాళ్ళకు ఇది పూర్తిగా సంబంధం లేని ప్లాట్ కావడంతో నిరాశ చెందారు. దానికి తోడు మ్యూజిక్ తో సహా ఇతర కీలక సాంకేతిక విభాగాలు ఎంతకష్టపడినా సరైన అవుట్ పుట్ రాలేకపోయింది. నిర్మాత కళ్యాణ్ రామ్ కు కిక్ 2 భారీ నష్టాలు ఇచ్చింది. సీక్వెల్ అనేది కత్తి మీద సాము లాంటిదని దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి రిస్క్ గ్రహించే ఒకదశలో ఇడియట్ కి పార్ట్ 2 తీద్దామని ఆలోచించిన పూరి సైతం ఆ ఆలోచన మానుకున్నారు.