Movies

బాలకృష్ణ యాడ్స్ లో నటించకపోవటానికి అసలు కారణం ఇదే

బాలనటుడిగా 1974లో తెరంగ్రేట్రం చేసి, హీరోగా అవతారం ఎత్తి, ఇప్పటిదాకా అవిశ్రాంతంగా 46 ఏళ్ళుగా నటిస్తున్న ఏకైక నట వారసుడు నందమూరి నట సింహం బాలకృష్ణ. తెలుగు సినిమా ఇండస్ట్రీ సీనియర్ టాప్ హీరోల్లో ఒకరు. టాలీవుడ్ నటవారసుల్లో టాప్ హీరో అనిపించుకున్న తొలి కథానాయికుడు. బహుశా ప్రపంచ సినీ చరిత్రలో ఒక నట వారసుడు అది కూడా హీరోగా నటించింది లేదు. హీరోగా 105 సినిమాలు చేసారు. ఇక అతని తరం నటుల్లో టాలీవుడ్లో జానపద, పౌరాణిక, సాంఘిక, చారిత్రాత్మక చిత్రాల్లో నటించిన ఏకైక నటుడు గా కూడా బాలయ్యే నిలుస్తాడు.

హీరో లందిరిదీ ఒక రకమైతే.. బాలయ్యది డిఫరెంట్ స్లైల్ అంటారు. తన తోటి హీరోల్లో చాలా మంది సినిమాల్లో వచ్చిన ఇమేజ్‌‌తో వాణిజ్య ప్రకటనల్లో నటించి,రెండు చేతులా సంపాదించారు. చివరకు నందమూరి హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ లో కూడా చేస్తున్నాడు. ‌ అయితే బాలయ్య మాత్రం ఇంత వరకు ఒక్క కమర్షియల్ యాడ్ లో కూడా చేయలేదు. అయితే దీనికి పెద్ద కారణం కూడా ఉందని బాలయ్య చెప్పేమాట. ముఖ్యంగా యాడ్స్‌లో నటించకపోవడానికి నాన్న ఎన్టీఆర్ కారణం అన్నారు. నాన్న ఎన్టీఆర్ ఏనాడు తన ఇమేజ్‌ను అడ్డం పెట్టుకొని సినిమా ప్రకటనల్లో నటించలేద ని గుర్తుచేశాడు.

అయితే కొంత మంది ఎన్టీఆర్ ని తమ సొంత ఆస్తిగా భావించి ఆయన సినిమాల్లో నటించిన ఫోటోల్నే తమ ప్రొడక్ట్ మీద వేసుకొని పబ్లిసిటీ చేసుకునే వాళ్ళని బాలయ్య వివరించాడు. మనకు ఈ ఇమేజ్ ఇచ్చింది ప్రేక్షకులే. అందుకే వాళ్లను మెప్పించే సినిమాలు చేసి వాళ్ల అభిమానాన్ని పొందాలి. అంతే కానీ.. వాళ్లిచ్చిన ఇమేజ్‌ను మన స్వార్థం కోసం ఉపయోగించకూడదన్నదే నాన్న ఎన్టీఆర్ అభిప్రాయం. ఆయన బాటలోనే నేను కూడా ఇప్పటి వరకు కమర్షియల్ యాడ్ లో నటించలేదని చెప్పాడు. ఒకవేళ ప్రజలకు ఏమైనా మేలు జరిగితే మాత్రం తప్పకుండా యాడ్ లో చేస్తానే తప్ప ,డబ్బు కోసం మాత్రం చేయనని కుండబద్దలు కొట్టాడు. నాకు ఉన్నది సరిపోతుందని కూడా చెప్పడం విశేషం.