కీరవాణి చెల్లెలు శ్రీలేఖ గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?

ప్రేమించు అనే సినిమాలో “కంటేనే అమ్మ అని అంటే ఎలా ..”అనే పాటలో అమ్మకోణాన్ని రెండుగా చూపిస్తూ డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసిన గీతానికి చక్కని బాణీ కట్టిన ఎం ఎం శ్రీలేఖ ఎన్నో మూవీస్ కి సంగీతం సమకూర్చడమే కాదు, పాటలూ పాడింది. ఇంతకీ ఈమె స్వయంగా ఎం ఎం కీరవాణికి చెల్లెలు. తెలుగు చిత్ర పరిశ్రమ ఆవిర్భావం నుంచి ఎందరో సంగీత దిగ్గజాలు సంగీత దర్శకులుగా ఆణిముత్యాల్లాంటి పాటలకు బాణీలు కట్టి ప్రజల హృదయాలలో నిల్చిపోయారు. ఇంకా ఎందరో సంగీత దర్శకులు వస్తూనే ఉన్నారు. తమ ప్రతిభను చాటుకుంటూనే ఉన్నారు.

అందులో ఎం ఎం శ్రీలేఖ కూడా ఒకరు. ఈమె 12ఏళ్ళవయస్సులోనే సోదరుడు కీరవాణి దగ్గర పాఠాలు నేర్చింది. 1995లో దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు తీసిన నాన్నగారు మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె .. ఆతర్వాత మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు తీసిన తాజ్ మహల్ మూవీతో బాగా పాపులర్ అయింది. మెలోడీ పాటలతో తాజమహల్ మూవీకి వన్నె తెచ్చింది. ఎందుకంటే గీత రచయిత చంద్రబోస్ కి బ్రేక్ ఇచ్చిన మూవీ కూడా ఇదే. ఇక హీరో శ్రీకాంత్ ని హీరోగా నిలబెట్టింది కూడా ఈ మూవీయే.

ఇక విక్టరీ వెంకటేష్ ధర్మచక్రంతో స్టార్ హీరోల మూవీస్ కూడా చేయగలనని శ్రీలేఖ నిరూపించింది. అయితే 75మూవీస్ అందునా హిందీ సినిమాలకు కూడా అలవోకగా మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈమె సంగీతం మాత్రం పెద్దగా నేర్చుకోలేదట. శివయ్య, ప్రేయసి రావే, ప్రేమించు వంటి మూవీస్ తో మంచి పేరుకూడా తెచ్చుకున్న ఈమె 2003లో పెళ్లయ్యాక బ్రేక్ తీసుకుంది. ఎక్కువగా సురేష్ ప్రొడక్షన్స్ మూవీస్ కి సంగీతం అందించిన ఈమెకు ఫాన్స్ ఎక్కువే. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఈ విషయం చెబుతుంది.