అనసూయ నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం

క్రేజ్ ఉన్నపుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న సామెతను వంటబట్టించుకున్న యాంకర్ అనసూయ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ యాంకర్స్‌లో ఒకరుగా రాణిస్తోంది. ఒకపుడు అనసూయ ఖాళీగా ఉన్నపుడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఇటు బుల్లితెర అటు వెండితెర మీద వరుస ఛాన్స్ లు అందిపుచ్చుకుంటూ సంపాదనలో కూడా తన సత్తా చాటుతోంది. నిజానికి తెలుగు ఇండస్ట్రీలో యాంకర్స్ సంపాదన పరంగా చూసుకుంటే సుమ అందనంత ఎత్తులో ఉంది. ఆమె తర్వాత అనసూయ ఉందని అంటున్నారు. ఇతర యాంకర్స్ అసూయ పడేలా స్థాయిలో రంగమ్మత్త రెండుచేతులా సంపాదన ఉందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఏడాదికి ఎంత తక్కువ అనుకున్నా కూడా 2 కోట్లకు పైగానే సంపాదిస్తుందని టాక్.

యాంకరింగ్ నుంచే 20 లక్షల వరకు అనసూయ సంపాదిస్తుంది. దాంతో పాటు షోలు, మధ్యలో ఈవెంట్స్, సినిమాలు అన్నీ వెరసి కోట్ల ఆదాయం వస్తోందట. ముఖ్యంగా కోటికి పైగా విలువ చేసే ఆడి కార్ తో పాటే జూబ్లీహిల్స్‌లో దాదాపు 5 కోట్ల విలువ చేసే ఒక ఇల్లు కూడా ఉంది. అందుకే ఈ అమ్మడు ఈమధ్య తరచూ వార్తల్లోకి కూడా వస్తోంది. పైగా ఈ మధ్యే ఐటి రైడ్స్ కూడా జరిగాయని ఇండస్ట్రీలో ప్రచారం కూడా జరగ్గా, అనసూయ స్పందిస్తూ అలాంటిదేమీ లేదని చెప్పింది.

పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైన తర్వాత కూడా ఈమె ఇప్పటికీ హాట్ షోతో మతులు పోగొడుతోంది. ఈమె అందానికి ఫిదా అయ్యే ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ ఈమె ఈ స్థాయిలో అందాన్ని కాపాడుకుంటూ వస్తోంది. ముఖ్యంగా ఈమె ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షోతో చాలా ఇమేజ్ సంపాదించుకుంది. ఈ షోతో వచ్చిన పాపులారిటీతోనే సినిమాలు కూడా చేస్తుంది అనసూయ. సహజంగా పెళ్లి తర్వాతే కెరీర్ క్లోజ్ అని చెబుతారు. అయితే అనసూయ విషయంలో పెళ్లి తర్వాతే అసలు ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందని చెప్పాలి. అందుకే ఇప్పుడు సంపాదిస్తున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో అనసూయ కూడా రెండు చేతులా సంపాదిస్తోంది.