సీఎం జగన్ హెయిర్ స్టైల్ సీక్రెట్… ఖర్చు ఎంతో తెలుసా ?

దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్ ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప పాదయాత్ర చేసి,అన్ని వర్గాల సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. ఏడాదిన్నర పాటు సాగిన పాదయాత్ర ఫలించింది. అందుకే 2019ఎన్నికల్లో 175సీట్లకు గాను అత్యధికంగా 151సీట్లు గెలుచుకున్నారు. దీనివెనుక ఎంతోకష్టం ఉంది. నిరంతర శ్రమ ఉంది. ఎన్నో అవమానాలు ఎదుర్కొని,ఆరోపణలు అధిమించి ప్రజాభిమానం దండిగా పొందారు. ఎపి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి,ఎన్నికల హామీలను నెరవేరుస్తూ వస్తున్నారు.

ఓ పక్క కరోనా, మరోపక్క ఆర్ధిక సమస్యలు వెంటాడుతున్న ఇచ్చిన హామీల అమలుకోసం చేస్తున్న కృషి పార్టీ శ్రేణులను ఆనంద పరుస్తోంది. తండ్రికి తగ్గ తనయునిగా ఎన్నో సంక్షేమ పథకాలతో పాలన సాగిస్తున్న జగన్ అన్ని వర్గాలకు చేయూతనిస్తూ పాలనలో దూసుకుపోతున్నారు. అందరూ ఎపి వైపు చూసేలా చేస్తున్నారు.ఇక సీఎం జగన్ హేయిర్ స్టైల్ చెక్కుచెదరకుండా ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. పాదయాత్రలో గానీ,సీఎం అయ్యాక గానీ ఆయన హెయిర్ స్టైల్ లో మార్పులేదు.

లండన్ తదితర చోట్ల భారీ ఆఫర్స్ వదిలేసిన హెయిర్ స్టైల్ స్పెషలిస్ట్ ప్రకాష్ దీనికి కారణం. హైదరాబాద్ హెయిర్ స్పెషల్ స్టూడియో నిర్వహిస్తూ, హై ప్రొఫైల్ వ్యక్తులకు మాత్రమే పనిచేస్తాడు. పలువురు సినీ సెలబ్రిటీలకు హెయిర్ స్టైల్ లో స్పెషలిస్ట్ గా వ్యవహరించిన ప్రకాష్ కి జగన్ సంబంధం ఏర్పడడానికి ప్రధాన కారకుడు టాలీవుడ్ హీరో శర్వానంద్. నిత్యం పబ్లిక్ లైఫ్ లో ఉండే వ్యక్తులకు లుక్ బాగుండాలి. అందుకే ప్రకాష్ ఎప్పుడు ఎలా చేస్తాడో తెలీదు గానీ జగన్ హెయిర్ స్టైల్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.