Movies

అరుదైన వ్యాధితో కోలుకున్న ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?

ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ స్నేహ ఉల్లాల్ ఆతర్వాత ఎక్కువ కాలం ఇండస్ట్రీలో లేదు. బాలీవుడ్ ఐశ్వర్య రాయ్ గా పేరుపొందిన ఉల్లాల్ తన నటనతో తొలి మూవీతోనే ఆడియన్స్ కి దగ్గరైంది. ఏ కరుణాకరన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయింది.

అయితే అనుకోకుండా ఏదో కారణం వలన ఇండస్ట్రీకి దూరమైన స్నేహ ఉల్లాల్ ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంది. పలు ఫోటో షూట్ సంస్థల కార్యక్రమాల్లో పాల్గొని వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. గత మూడు ఏళ్లుగా ఆమె రక్తసంబంధిత వ్యాధితో బాధపడి కోలుకుందట.

హ్యూమన్ డిజాస్టర్ పేరిట వచ్చిన ఈ వ్యాధివలన 20,30నిమిషాల సేపు మించి నిలబడపోయేదానినని స్నేహ ఉల్లాల్ చెప్పుకొచ్చింది. ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడం వలన మూడేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉన్నానని స్నేహ ఉల్లాల్ చెప్పింది. ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందినట్లు ఆమె తెల్పింది. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పింది. ఇప్పుడు అవకాశం వస్తే సినిమాల్లో నటించటానికి సిద్ధంగా ఉందట.