షూటింగ్స్ కి పేరెంట్స్ ఏ కండీషన్స్ పెడుతున్నారో చూస్తే షాక్ అవుతారు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కి వాక్సిన్ రాలేదు. అందుకే ఎప్పుడు ఎవరిని తాకుతుందో తెలియడం లేదు. కరోనా కారణంగా అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. అన్ లాక్ తో ఒక్కొక్కటి తీర్చుకుంటున్నా మళ్ళీ కరోనా విజృంభణతో మూతపడుతున్నాయి. ఇక గత నాలుగు నెలలుగా సినీ ఇండస్ట్రీ క్లోజ్ అవ్వడంతో సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. నటీనటులు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. నిజానికి కరోనా కారణంగా మెయిన్ స్ట్రీమ్ షూటింగ్స్ ఆగిపోయినప్పటికీ బ్రాండ్ , ఎండార్స్ మెంట్స్ షూట్స్ మాత్రం ఆగలేదు. కాకపోతే షూటింగ్ లొకేషన్స్ మాత్రం చేంజ్ చేసారు.
సాధారణంగా ఇలాంటి యాడ్స్ షూట్స్ అన్నీ ఎక్కువగా ముంబైలో జరుగుతుంటాయి. అయితే ముంబైలో కరోనా ఆంక్షలు కారణంగా షూట్స్ అన్నీ హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ స్టూడియోలన్నీ ఇప్పుడు యాడ్ షూట్స్ సిబ్బంది హడావుడితో నిండిపోతున్నాయని టాక్. అయితే ఈ యాడ్ షూట్స్ లో పాల్గొనడానికి హీరోయిన్స్ కి ఇంట్లో పర్మిషన్స్ దొరకడం లేదట. ముఖ్యంగా ఈ షూట్స్ లో కొంతమంది స్టార్ హీరోయిన్స్ పాల్గొనవాల్సి ఉండగా పేరెంట్స్ మాత్రం షూటింగ్స్ కి నో అంటుంటున్నారట.
హీరోయిన్ అవుతానంటే హ్యాపీగా ఇండస్ట్రీలోకి పంపిన చాలామంది స్టార్ హీరోయిన్ల ఫాదర్లు ఇప్పుడు షూటింగ్స్ కి అడ్డుపడుతున్నారని క్యాస్టింగ్ వర్గాలు గగ్గోలు పెడుతున్నారట. ఇక కొందరి హీరోయిన్స్ పర్సనల్ మేనజర్లు షూట్ లొకేషన్ కి వెళ్లి అక్కడ సిబ్బంది కరోనా కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుసుకుతున్నారట. ముఖ్యంగా షూట్ లొకేషన్ ని వీడియో తీసి పంపితేనే హీరోయిన్లకి వారి ఇళ్లలో బయటకు వెళ్లడానికి పర్మిషన్స్ ఇస్తున్నారట. ఇలా అయితే ఇండస్ట్రీ ఎప్పటికి కోలుకుంటుందో చెప్పడం కష్టమేనని అంటున్నారు.