Movies

‘కన్నెమనసులు’ సినిమా వెనక ఉన్న నమ్మలేని నిజాలు…లాభం ఎన్ని కోట్లో…?

తెలుగులో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా నిల్చిన సూపర్ స్టార్ కృష్ణ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడు. ఇక గూఢచారి, జేమ్స్ బ్యాండ్ చిత్రాలకు శ్రీకారం చుట్టిన నటుడు కూడా ఈయనే. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కేవలం రెండు సినిమా తర్వాత చేసిన ‘గూఢచారి 116’ తో కృష్ణ మాస్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ చరిత్రలో సంచనాలు క్రియేట్ చేసారు.

సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని చేసిన ప్రయత్నం తేనెమనసులు మూవీతో తీరింది. ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్ళతోనే తీయాలని తేనెమనసులు మూవీ తెరకెక్కించారు. అది మంచి పేరు తెచ్చింది. ఇక ఆ సినిమా తర్వాత హీరోగా కృష్ణ నటించిన రెండో సినిమా కన్నెమనసులు సినిమాలో నటనతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. . 22 జూలై 1965లో రిలీజైన ఈ మూవీ 55 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది.

‘తేనే మనుసులు’లో నటించిన నటీనటులైన కృష్ణ, రామ్ మోహన్, సంధ్యారాణి, సుకన్యలతో బాబూ మూవీస్ పతాకంపై ఆదుర్తి సుబ్బారావు ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ రజకుడి పాత్రలో నటించారు. ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన గుమ్మడి, సూర్యకాంతం తదితరులు నటించారు. ముళ్లపూడి వెంకట రమణ మాటలు రాసిన ఈ మూవీకి కే.వీ.మహదేవన్ మ్యూజిక్ అందిం చారు. దాదాపు 300పైచిలుకు సినిమాల్లో చేసిన కృష్ణ తన నటవారసునిగా మహేష్ బాబుని ఎంట్రీ ఇప్పించారు. మహేష్ తండ్రిని మించిన తనయుడిగా రాణిస్తున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."