ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…అయితే ఆలస్యం చేయకుండా చూసేయండి

అందం ,అభినయం పుష్కలంగా గల అక్కినేని వారి కోడలు సమంత పెళ్ళికి ముందు కన్నా పెళ్లి తర్వాత మరింత బిజీ హీరోయిన్ గా మారి పోయింది. గ్లామర్ మూవీస్ మాత్రమే కాదు, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తూ, మరోపక్క రెమ్యునరేషన్ కూడా ఎక్కువే అందుకుంటోంది.

టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసన నటించిన ఈ డ్రీమ్ గర్ల్ 60ఏళ్ల బామ్మగా ఓ బేబీ సినిమాలో చేసిన యాక్టింగ్ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అంతెందుకు హీరోలతోనే కాదు,ఈగలతో కూడా చేసిన ఘనత సమంతకు ఉంది. రాజమౌళి తీసిన ఈగ మూవీలో సమంత యాక్టింగ్ అటు హీరో నానితో,ఇటు ఈగ రూపంలో ఉన్న హీరోతో కూడా చేసి మెప్పించింది.

ఏం మాయ చేసావే సినిమాతో నాగ చైతన్యతో నటించడమే కాదు, ప్రేమలో కూడా పడి, లవ్ ని పెళ్ళిపీటల వరకూ తీసుకెళ్లింది. అంతేకాదు,మజిలీ సినిమాలో నటించి పెళ్లి తర్వాత భర్తకు హిట్ ఇచ్చింది. ఇక తాజాగా దగ్గుబాటి రానా పెళ్ళిలో కూడా సరికొత్త డ్రెస్ లో మెరిసిన సమంత వార్తల్లో నిల్చింది. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తూ అభిమానులను కూడా అలరిస్తుంది.