Health

కలబందలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో ?

1. వాపును తగ్గిస్తుంది:
కలబంద రసం తీసుకుంటే వాపు తగ్గుతుంది.

ఎలా ఉపయోగించాలి?
కలబంద రసం వాణిజ్యపరంగా అందుబాటులో ఉంది. కానీ మన ఇంటిలో ఉండే కలబంద మొక్క నుండి తాజాగా రసాన్ని తీసుకోవచ్చు.

కావలసినవి
కలబంద ఆకు – 1
నీరు – ఒక కప్పు
తేనే – 1 స్పూన్

పద్దతి
కలబంద ఆకును కట్ చేసి పై పొరను తీసి జెల్ ని తీయాలి. ఒక బౌల్ లో కలబంద
జెల్, నీరు, తేనే వేసి బాగా కలపాలి.

ఎలా పనిచేస్తుంది?
శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఆక్సీకరణ కారణంగా కణాలకు నష్టం జరిగి వాపు
వస్తుంది. కలబందలలో యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన ఫ్రీ రాడికల్స్
ని తొలగించి వాపును తొలగిస్తుంది.

హెచ్చరిక
కలబందలో విరేచనకారి లక్షణాలు ఉండుట వలన జీర్ణశయాంతర అసౌకర్యంను కలిగిస్తుంది.

2. గుండె మంటను తగ్గిస్తుంది
కలబంద రసాన్ని గ్యాస్ట్రోఎసోఫాగియల్ చికిత్సలో ఉపయోగిస్తున్నారు. గుండెల్లో, ఛాతి నొప్పి మరియు మింగడంలో ఇబ్బంది వంటి సమస్యలను కలబంద సమర్ధవంతంగా పరిష్కరిస్తుంది.

ఎలా పనిచేస్తుంది?
కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన కడుపు మరియు అన్నవాహికకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాక జీర్ణశయాంతర సమస్యలకు కారణం అయిన వ్యాధి కారకాల మీద పోరాటం చేస్తుంది.

3. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది ఒక పరిశోదనలో కలబంద రసం ప్రారంభ దశలో ఉన్న కొలెస్ట్రాల్ ని తగ్గించటానికి సహాయపడుతుందని తెలిసింది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుట వలన మధుమేహం ఉన్న వారు కలబంద సప్లిమెంట్స్ ఉపయోగిస్తారు.

ఎలా పనిచేస్తుంది?
క్లినికల్ ట్రయల్స్ లో కలబంద కీలక అవయవాలలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని చూపిస్తున్నాయి. అంతేకాక రక్త గ్లూకోజ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది.

4. నోటి ఆరోగ్యం
కలబంద నోటి ఆరోగ్యానికి ఒక టూట్ పేస్ట్ వలే ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఎలా పనిచేస్తుంది?

కలబంద జెల్ లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన బాక్టీరియా కారణంగా వచ్చే కావిటీ మీద పోరాడటానికి సహాయపడుతుంది. చిగురు యొక్క శోథను తగ్గించటానికి కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

5. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది
కలబంద రోగనిరోధక శక్తిని మెరుగుపరచటంలో సహాయపడుతుంది.

ఎలా పనిచేస్తుంది?
కలబంద రోగనిరోధక వ్యవస్థను బలపరచటానికి అవసరమైన నైట్రిక్ ఆక్సైడ్, సైటోకైన్ కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

6. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
కలబందలో యాంటీ ట్యూమర్ మరియు వ్యతిరేక క్యాన్సర్ లక్షణాలు ఉండుట వలన రోగనిరోధక వ్యవస్థ మీద నేరుగా ప్రభావం చూపుతుంది.

ఎలా పనిచేస్తుంది?
కలబంద శరీరంలో రోగ నిరోధక వ్యవస్థకు ఒక ఊపును తెచ్చి కణితుల మీద పోరాటం చేయటానికి సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాలు కలబంద కణితుల పరిమాణం తగ్గించడానికి మరియు క్యాన్సర్ రోగుల మనుగడ రేటు పెంచటానికి సహాయపడుతుందని నిరూపించాయి.