Health

మెదడు గురించి మీకు తెలియని 10 ఆసక్తికరమైన నిజాలు

మెదడు అనేది మన శరీరంలోని అత్యంత నిగూడమైన అవయవం. ఇప్పటికి మన మెదడు గురించి తెలియని మిలియన్ల కొద్ది విషయాలు ఉన్నాయి. మన మెదడు మన భావాలను సజీవంగా ఉంచటం మరియు అవయవాలను కదిలేలా చేస్తుంది. కానీ మనకు మెదడు
గురించి తెలియని చాలా నిజాలు ఉన్నాయి.

1. మెదడుకి నొప్పి ఉండదు
మెదడుకి ఎటువంటి నొప్పి ఉండదు. ఇది పూర్తిగా నిజం. మెదడుకు నొప్పిని కలిగించే నొప్పి గ్రాహకాలు ఉండవు. అందువల్ల మెదడుకు నొప్పి అనుభూతి ఉండదు. అంతేకాక రోగి మెలుకువగా ఉన్నప్పుడు మెదడుకు ఆపరేషన్ చేసే అవకాశం కూడా ఉంది.

2. మైళ్ళ కొద్ది రక్త నాళాలు
మెదడులో రక్త నాళాలు వందల వేల మైళ్ళు ఉంటాయి. ఆ రక్త నాళలతో భూమిని నాలుగు సార్లు చుట్టి రావచ్చు. అలాగే మెదడు వందల బిలియన్ న్యూరాన్లు తయారుచేస్తుంది. ఇది గెలాక్సీ మొత్తాన్ని కవర్ చేస్తుంది. కానీ మన శరీరంలో 2 శాతాన్ని ఆక్రమిస్తాయి. ఆక్సిజన్ తీసుకోవటానికి 20 శాతంను వినియోగిస్తుంది.

3. కుడి ఎడమ, ఎడమ కుడి
మెదడు ఒకే రకంగా ఉండే రెండు బాగాలుగా విభజించబడిన విషయం మనకు తెలిసిందే. అలాగే ఇద్దరు స్నేహితులు ఉత్తమంగా ఉన్నప్పటికి, వారి క్యారెక్టర్ ల విషయంలో మాత్రం తేడాలు ఉంటాయి. అదే విదంగా మన మెదడులో రెండు బాగాలు కూడా అటువంటి తేడానే కలిగి ఉంటాయి. మెదడు యొక్క ఎడమ వైపు బాగం సహేతుక విశ్లేషణాత్మక లక్షణాలతో సంబంధం కలిగి ఉంటుంది. మెదడు యొక్క కుడి బాగం ఎక్కువగా సృజనాత్మక విషయాలను సూచిస్తుంది. ఒక అసాదారణ వింత ఏమిటంటే మెదడు కుడి బాగం శరీరం యొక్క ఎడమ బాగాన్ని నియంత్రిస్తుంది. అదే మెదడు యొక్క ఎడమ బాగం శరీరం యొక్క కుడి బాగాన్ని నియంత్రిస్తుంది.

4. ఐన్ స్టీన్ యొక్క మెదడు
ఐన్ స్టీన్ 1955 లో మరణించిన తర్వాత అయన మెదడు మీద పరిశోదనలు చేసారు. అయన మెదడును సుమారు 240 ముక్కలుగా కోసి పరిశోదన చేసి కొన్ని విషయాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎవరు ఊహించని విధంగా అయన మెదడులో మూడు దశాబ్దాల తర్వాత కనిపించే ఆలోచనలను కనుగొన్నారు.

5. పురుషులు,స్త్రీలలో తేడా
మెదడు పురుషులలో స్త్రీల కన్నా 10 శాతం పెద్దగా ఉంటుంది. స్త్రీ యొక్క మెదడు చిన్నగా ఉన్నప్పటికీ, ఎక్కువ నరాల కణాలతో నిర్మితమై ఉంటుంది. అందువల్ల పురుషుని కంటే స్త్రీ యొక్క మెదడు మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

6. నిద్రలో మెదడు చురుగ్గా ఉంటుంది
నిద్రలో మెదడు చురుగ్గా ఉంటుందనే విషయాన్నీ చెప్పి మనం ఆఫీస్ లో దర్జాగా పడుకోవచ్చు. వెంటనే మీ బాస్ అంగీకరిస్తారు.

7. సైజ్ తో పట్టింపు లేదు
ఒక పరిశోదన ప్రకారం, ఒక వ్యక్తి మేదావి అని చెప్పటానికి మెదడు సైజ్ తో సంబంధం లేదని తెలిసింది. ఎందుకంటే ఆల్బర్ట్ ఐన్ స్టీన్ యొక్క మెదడు సగటు పరిమాణం కంటే తక్కువగా ఉంది. కొంత మంది దీనికి విరుద్దంగా మెదడు పెద్ద సైజ్ లో ఉంటే మేధావి అని నమ్ముతారు. కానీ ఒక వ్యక్తి మేధావి అని చెప్పటానికి సైజ్ తో సంబంధం లేదు.

8. గొప్ప స్వప్నావస్థ
ఒక వ్యక్తి కనే గొప్ప కలలు అనేవి అతడు / ఆమె కలల యొక్క ఫలితాలను బయట నియంత్రించవచ్చు. ఇది ఎంత మనోహరంగా ఉంది.

9. నవ్వు వెనక రహస్యం
అసలు మనిషి ఎందుకు నవ్వుతున్నాడు. నవ్వు వెనక రహస్యం ఎవరికైనా తెలుసా. నిజమైన నవ్వుకు మరియు దాన్ని ప్రేరేపించటానికి 20,000 లకు పైగా కారణాలు ఉన్నాయి.

10. IQ అత్యదిక రికార్డ్ 210
అత్యధిక IQ రికార్డ్ ఉన్న వ్యక్తిగా కిమ్ ఉంగ్-యాంగ్ రికార్డ్ సాదించాడు. 1972 మార్చి లో పుట్టిన అయన 8 నెలల వయస్సులోనే బీజగణితం అర్థం మరియు అనర్గళంగా నాలుగు భాషలను మాట్లాడారు. అంతేకాక అయన 4 సంవత్సరాల వయస్సులో ఒక విశ్వవిద్యాలయ విద్యార్ధిగా మారి, 15 ఏళ్ళ వయసులో గ్రాడ్యుయేట్ పూర్తి చేసాడు. అతను ఒక చిత్రకారుడు మరియు ఒక కవి. అలాగే అతను ప్రపంచ అద్భుతాల గురించి కూడా చర్చించేవాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."