Health

పిల్లల్లో చురుకుదనం లేకపోవటానికి కారణాలు

సాదారణంగా పిల్లలు ఉరకలు వేసే ఉత్సాహంతో ఉంటారు. వారిలో ఆయాసం,అలుపు అనేవి మచ్చుకు కూడా కానరావు. అలాంటి వారు పెద్దవారిలాగానే అలసిపోతూ ఉంటారు. ఇప్పుడు దానికి గల కారణాల గురించి తెలుసుకుందాము.

నిద్రలేమి
సాదారణంగా పిల్లలకు కనీసం 9 గంటల నిద్ర అవసరం. సరిపడా నిద్ర లేకపోతే శారీరకంగాను,మానసికంగాను ఉత్సాహంగా ఉండలేరు. పిల్లలు మందకొడిగా ఉన్నప్పుడు వారు నిద్రపోయే సమయాన్ని మరి కొంత సేపు పోడిగించాలి.

పోషకాహార లోపం
ఎదిగే పిల్లలకు పోషకాహారం ఇవ్వటం తప్పనిసరి. పోషకాహార లోపం వలన పిల్లలో మందకొడితనం ఎక్కువ అవుతుంది. వారికీ విటమిన్స్,మినరల్స్ ఉన్న ఆహారం ఇవ్వాలి.

వ్యాయామం లోపించుట
ఇండోర్ గేమ్స్ ఆడే పిల్లల కన్నా బయట ఆడుకొనే పిల్లలో చురుకుదనం ఎక్కువగా ఉంటుంది. అందువలన రోజు మొత్తం మీద కొంత సమయం పిల్లలు బయట ఆడుకొనే విధంగా తల్లితండ్రులు ప్రోత్సహించాలి.

మానసిక సమస్యలు
కుటుంబ సమస్యలు కూడా పిల్లల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల సాద్యమైనంత వరకు కుటుంబ సమస్యలను వారి దృష్టికి వెళ్ళకుండా చూడండి.

మందుల ప్రభావం
కొన్ని ఆరోగ్య సమస్యలకు వాడే మందులు కూడా పిల్లలో చురుకుదనాన్ని హరిస్తాయి. ఈ విషయాన్నీ వ్యైద్యుల దృష్టికి తీసుకువెళ్లటం ద్వారా సమస్యను చాలా వరకు పరిష్కరించవచ్చు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."