Beauty Tips

చూడగానే మంచి లుక్ తో కనపడాలంటే…. Best Tips

సాధారణంగా శరీరంలో ఏదో ఒక భాగం కొద్దిగా పెద్దగానో,చిన్నగానో ఉండవచ్చు. ఇది పెద్ద సమస్య కాదు. దీని వలన సౌందర్యానికి ఎలాంటి నష్టం ఉండదు. అయితే వేసుకొనే డ్రెస్ అందముగా లేకపోతె దాని లోపం ప్రస్పుటంగా కనిపిస్తుంది. అలాంటి చిన్న చిన్న లోపాలను అదికమిస్తే అందముగా కనపడతారు. మీరు ధరించే దుస్తుల రంగు మీకు నప్పే విధంగా ఉండాలి. కొద్దిగా పొట్టిగా ఉన్నవారు లేత రంగులు,పొడవుగా ఉన్నవారు ముదురు రంగులను ధరిస్తే చూడముచ్చటగా ఉంటారు.

భుజాలు వెడల్పుగా ఉండటం అనేది చాలా మందిలో కనిపించే సాదారణ సమస్య. భుజాలు వెడల్పుగా ఉన్నవారికి పెద్ద మెడ ఉన్న జాకెట్లు,పొట్టి చేతులు ఉన్న జాకెట్లు,తేలికపాటి దుస్తులు బాగుంటాయి.

చెస్ట్ పెద్దదిగా ఉన్నవారు ‘వి’ నెక్ ఉన్న జాకెట్లు ఎప్పటికి ధరించకూడదు. కొద్దిగా పెద్ద మెడ,పొడుగు చేతుల జాకెట్లు వీరికి బాగా నప్పుతాయి. చెస్ట్ చిన్నదిగా ఉన్నవారికి ‘వి’ నెక్ ఉన్న జాకెట్లు,కొంచెం బరువుగా ఉన్న దుస్తులు నప్పుతాయి.

చేతులు లావుగా ఉన్నవారికి స్లీవ్ లెస్ జాకెట్లు అంతగా నప్పవు. మందపాటి లేదా బరువు ఎక్కువగా ఉన్న దుస్తులను వీరు ధరించకుండా ఉంటేనే మంచిది.

మరీ బిగుతుగా ఉండే దుస్తులు ఎప్పుడు ధరించకూడదు. ఇవి మిమ్మల్ని మరింత లావుగా కనిపించేలా చేస్తాయి. శరీరానికి అతికినట్లు ఉండే దుస్తులు మాత్రమే మిమ్మల్ని సన్నగా,నాజుగ్గా కనిపించేలా చేస్తాయి. చాలా మంది శుభకార్యాలలో నలుపు రంగు దుస్తులు ధరించటానికి ఇష్టపడతారు. అయితే ఆ సందర్భాలలో ఈ రంగు అంతా మంచిది కాదని నిపుణులు చెప్పుతున్నారు.