Beauty Tips

చర్మ సౌందర్యానికి నిమ్మ ఎంత మాయ చేస్తుందో తెలుసా ?

నిమ్మకాయలు కనపడగానే జ్యూస్ చేసుకొని త్రాగాటమో,పులిహోర చేసుకోవటమో,ఇంకా కొద్దిగా టైం ఉంటే పచ్చడి చేయటమో చేస్తాము. అంతే తప్ప దానిని ఒక సౌందర్య సాధనంగా మాత్రం చూడము.
చర్మ సౌందర్యానికి మార్కెట్ లో లభ్యమయ్యే సౌందర్య సాదనాల కంటే నిమ్మకాయ ఎన్నో రెట్ల మంచి పలితాన్ని ఇస్తుంది. అందుకే చాల సౌందర్య సబ్బులలో నిమ్మను వాడతారు. అలాగె నిమ్మను చాల సౌందర్య సాదనాలలో ఉపయోగిస్తారు. ముఖంమీద ముడతలను, మృతకణాలను ఇది తొలగిస్తుంది. జిడ్డు చర్మాన్ని మాపడానికి దీనికి మించిన మందు లేదు. ఊబ కాయానికి కూడ ఇది చాల మంచి మందు. నిమ్మరసంలోని విటమిన్ సి గల ఏంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు చేసినవారికి ఇది చాలా మంచిది.

* నిమ్మరసం,నీరు రెండిటిని ఒకే మోతాదులో కలిపి చర్మానికి అప్లై చేసి కొద్దిసేపు అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

* చర్మం లేదా ముఖం మీద దద్దుర్లు, మచ్చలతో బాధపడుతూ ఉన్నప్పుడు నిమ్మ వైద్యం బాగా పనిచేస్తుంది. నిమ్మరసం ను దద్దుర్లు,మచ్చలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. రోజు మొత్తంలో వీలు అయిన్నని సార్లు ఈ విధంగా చేసినట్లయితే క్రమంగా తగ్గుతాయి.
* కొద్దిగా నిమ్మరసం,దానికి రెట్టింపు రాళ్ల ఉప్పు,ఆలివ్ ఆయిల్ కలిపి బాగా మెత్తగా చేసి శరీరం మొత్తం అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.

* తాజా నిమ్మరసం ను మోచేతులు,మోకాళ్ళకు రాస్తే త్వరలో నలుపు తగ్గిపోతుంది.

* రాత్రి పడుకోవటానికి అరగంట ముందు ముఖం,మెడ,చేతులకు నిమ్మరసం అప్లై చేసి,తెల్లవారి లేచిన వెంటనే గోరువెచ్చని నీతితో కడుక్కోవాలి. ఈ విధంగా చేయుట వలన ముడుతలను,మచ్చలను తగ్గించుకోవచ్చు.

* ఎండలో ప్రయాణం చేసినప్పుడు చర్మం కందినప్పుడు నిమ్మరసం అప్లై చేసి మసాజ్ చేయాలి.