ధర్మవరపు సుబ్రహ్మణ్యం గుర్తున్నారా…. కొడుకులు ఏం చేస్తున్నారో తెలుసా?

ధర్మవరపు సుబ్రహ్మణ్యం టాలీవుడ్ లో గొప్ప కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మిగతా కమెడియన్ లతో పోలిస్తే ధర్మవరపు సుబ్రహ్మణ్యం కామెడీ టైమింగ్ భిన్నంగా ఉంటుంది. ధర్మవరపు మొదట బుల్లితెర తో మొదలుపెట్టి ఆ తర్వాత వెండితెర పైన తానేమిటో నిరూపించుకున్నారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం ప్రకాశం జిల్లాకి చెందిన వారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండటం ఇంట్లో సినిమాల్లో నటించడానికి ఒప్పుకోరని ఇంట్లో నుంచి పారిపోయి మద్రాస్ చేరుకొని అవకాశాల కోసం ప్రయత్నిస్తే రాకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చేసారు.

ధర్మవరపు సుబ్రహ్మణ్యం చదువుపై కూడా ఆసక్తి ఎక్కువే. సినిమాలపై దృష్టి పెట్టి చదువును ఎప్పుడు అశ్రద్ధ చేయలేదు. ఇంటికి వచ్చాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగం సంపాదించారు ఉద్యోగం చేసుకుంటూ బుల్లితెరలో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత సినిమాల వైపు వెళ్లారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యంకు ఇద్దరు కొడుకులు. వారిద్దరికీ సినిమాలపై టీవీ రంగంపై ఆసక్తి లేకపోవడంతో వ్యాపారం చేస్తూ ఆ రంగంలో మంచి స్థాయికి చేరి తండ్రి పేరు నిలబెడుతున్నారు.

error: Content is protected !!