Movies

చూడాలని ఉంది సినిమా వెనక ఉన్న నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

జగదేకవీరుడు అతిలోక సుందరి తర్వాత భారీ బడ్జెట్ తో మెగాస్టార్ చిరంజీవితో వైజయంతి బ్యానర్ పై అశ్వినీదత్ తీసిన మూవీ చూడాలని ఉంది ఎన్నో అంచనాల మధ్య విడుదలై రికార్డ్ క్రియేట్ చేసింది. 1998ఆగస్టు 27న రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నిజానికి అప్పటికే సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో ఫాన్స్ తో పాటు జనంలో కూడా క్రేజ్ వచ్చేసింది. ఈ సినిమా కి గుణశేఖర్ డైరెక్టర్ గా వ్యవహరించగా, చోటా కె నాయుడు కెమెరామెన్ గా వ్యవహరించాడు. ఈ సినిమా టైటిల్ నుంచి అన్నీ ఆశ్చర్యమే. కానీ రిలీజ్ అయ్యాక ఫాన్స్ ,జనం కూడా కనెక్ట్ అయ్యారు. నిజానికి రామ్ గోపాల్ వర్మ,సింగీతం శ్రీనివాసరావు లతో రెండు సిన్మాలు స్టార్ట్ అయ్యి ఆగిపోయాక ఏ సినిమా చేయాలన్న ఆలోచనలో ఉండగా అశ్వినీదత్ చేసిన చూడాలని ఉంది ప్రాజెక్ దుమ్మురేపింది.

అప్పటికే రెండుమూడు సినిమాలు తీసిన గుణశేఖర్ కథ అనగానే అశ్వినీదత్ ఒకే చెప్పాక… చిరంజీవి ఇంటికి సెంటిమెంట్ గా మంగళవారం వెళ్లిన గుణశేఖర్ కి చిరు ఆత్మీయ స్వాగతం పలికారు. సాదరంగా ఆహ్వానించి ,కుశల ప్రశ్నల తర్వాత కథ విన్న చిరు ఒకే చెప్పాడు. సాంగ్స్ కంపోజ్ మణిశర్మ, హీరోయిన్స్ గా అంజలా జవేరీ,సౌందర్య సెలక్ట్. విలన్ గా ప్రకాష్ రాజ్. రెండు పాటలను డిఫరెంట్ గా చేయాలని మణిశర్మ భావించడం, గుణశేఖర్ సపోర్ట్ చేయడంతో త్యాగరాజ కీర్తనలో యమహా నగరి కలకత్తా పురి సాంగ్ చేయగా, రామ్మా చిలకమ్మా పాటను ఉదిత్ నారాయణ్ చేత పాడించడం తో బాలు చేత పాడించాలని చిరు అన్నారట. అయితే వెరైటీ కోసం చేశామని చెప్పడంతో ఒకే అన్నారు. నిజానికి ఈ రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.

ఇక కొరియోగ్రాఫర్ సరోజా ఖాన్ కోసం ముంబయి వెళ్లగా చిరు సాంగ్ కి కంపోజ్ అనగానే బిజీగా ఉన్నాసరే ఆమె ఒకే చేసింది. దాంతో ముంబయిలో ఓ మారియా సాంగ్ ని చిరు ,సౌందర్యలపై చిత్రీకరించారు. మరో సాంగ్ కూడా ఆమెతో కంపోజ్ చేయించాలని భావించారు. కలకత్తాలో షూటింగ్ అయ్యాక హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో 70లక్షలతో తోట తరణి కలకత్తా అపార్ట్ మెంట్ సెట్ వేయడంతో ఎందరో సినిమా ప్రముఖులు వచ్చి చూసి ఆశ్చర్యపోయారు. ఇక రైల్వే స్టేషన్ లో అంజలా జవేరి లైన్ వేసే రొమాంటిక్ సీన్ నాంపల్లిలో పక్కా ప్లాన్ తో గుణశేఖర్ చేయించాడు.

ఇక మాస్టర్ తేజను స్విమ్మింగ్ పూల్ లోకి విసిరేసే సీన్ చేయడానికి ప్రకాష్ రాజ్ ఒప్పుకోలేదట. చిన్న పిల్లాడిని అలా విసరడం బాగోదని అనడంతో ఎలాగోలా ఒప్పించి చేయడంతో ఆ సీన్ బాగా క్లిక్ అయింది. ఇలా వింత ఘటనలతో వచ్చిన చూడాలని ఉంది మూవీ మొదటి రోజున బ్లాక్ బస్టర్ రిపోర్ట్ వచ్చేసింది. కలెక్షన్స్ వర్షం కురిపించింది.63సెంటర్స్ లో వందరోజులు ఆడిన ఈమూవీ 20కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాతో టెక్నీషియన్స్ కి మంచి పేరు వచ్చింది. ప్రకాష్ రాజ్ కి విలన్ గా మంచి బ్రేక్ ఇచ్చింది.