ఈ హీరో తండ్రి పెద్ద రాజకీయవేత్త…. ఎవరో తెలుసా?

బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన భద్ర సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తుంది. ఈ సినిమాలో రవితేజ మీరాజాస్మిన్ హీరోహీరోయిన్లుగా నటించారు. రవితేజ స్నేహితుడిగా అర్జన్ బజ్వా నటించాడు. అతను కూడా సినిమా పరంగా మంచి మార్కులే పడ్డాయి. అయితే అర్జన్ బజ్వా ఢిల్లీలో పుట్టి పెరిగాడు. తండ్రి భారతీయ జనతా పార్టీ లో ప్రముఖమైన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నగరానికి ఒక మేయర్ గా కూడా కొంతకాలం పనిచేశారు.

అర్జన్ బజ్వా తండ్రి పేరు స్విందర్ జిత్ సింగ్. అర్జన్ బజ్వా కి చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఉండటంతో చదువుకునే రోజుల నుంచే యాడ్స్ లో మోడలింగ్ లో పాల్గొనేవాడు.2001 లో సంపంగి ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా హిట్టయినా పెద్దగా అవకాశాలు రాలేదు. భద్ర ప్రేమలో పావని కళ్యాణ్ కింగ్ అరుంధతి మిత్రుడు వంటి సినిమాల్లో నటించాడు.

error: Content is protected !!