Movies

కృష్ణ,కృష్ణంరాజు కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో ఎన్ని హిట్ అయ్యాయో తెలుసా ?

టాలీవుడ్ లో గడిచిన 50ఏళ్లుగా సూపర్ స్టార్ కృష్ణ, రెబెల్ స్టార్ కృష్ణంరాజుకి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. కృష్ణకు గల కొద్దిమంది ఫ్రెండ్స్ లో కృష్ణంరాజు ఒకడు. తేనే మనసులు మూవీ ఆడిషన్స్ చేస్తున్న సమయంలోనే కృష్ణను కృష్ణంరాజు చూసారు. కృష్ణ సెలక్ట్ కాగా కృష్ణంరాజు రిజెక్ట్ అయ్యారు. ఆ సందర్బంగా కృష్ణ చిన్న పార్టీ ఇచ్చాడు. ఆతర్వాత చిలకా గోరింకా మూవీ తో హీరోగా కృష్ణంరాజు ఎంట్రీ ఇచ్చాడు. కృష్ణ కెరీర్ ని మలుపు తిప్పిన నేనంటే నేనే మూవీలో కృష్ణంరాజు విలన్ గా చేసారు. అల్లూరి సీతారామరాజు మూవీ చేయాలన్న సంకల్పంతో కృష్ణంరాజు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అయితే తాను తీస్తున్నట్లు కృష్ణ ప్రకటించగానే తన దగ్గర వివరాలన్నీ కృష్ణకు ఇచ్చేసారు.

ఇక తమిళంలో శివాజీ గణేశన్ మూడు పాత్రలు వేసి చేసిన దైవ మదన్ మూవీని చేయాలనీ కృష్ణంరాజు భావించి రీమేక్ హక్కులు కూడా తీసుకున్నారు. అయితే కృష్ణ చేయడానికి ఉత్సాహం చూపించడంతో వద్దని కృష్ణంరాజు వారించాడు. ఏం నేను చేయలేనని అనుకుంటున్నావా అనడంతో,ఇందులో అంశాలు ఇప్పటికే చాలా సినిమాల్లో వచ్చేసాయి. అందుకే ఆలోచిస్తున్నా అని రెబెల్ స్టార్ అన్నాడు. అయితే రక్త సంబంధం పేరుతొ కృష్ణ ఆ సినిమా చేసేసాడు. ఇక కృష్ణ తీసిన కురుక్షేత్రంలో కర్ణుడి పాత్ర రెబెల్ స్టార్ వేసాడు. నిజానికి ఎన్టీఆర్ తీస్తున్న దాన వీర సూర కర్ణ మూవీ చేస్తున్నందున రెబెల్ స్టార్ వెనకడుగు వేస్తె, కృష్ణ వత్తిడితో చేయాల్సి వచ్చింది.

మనుషులు చేసిన దొంగలు,అడవి సింహాలు,యుద్ధం ,విశ్వనాధ నాయకుడు మూవీస్ లో సూపర్ స్టార్,రెబెల్ స్టార్ కల్సి నటించారు. ఇందులో యుద్ధం మూవీ తప్ప మిగిలిన రెండు హిట్ అయ్యాయి. అయితే ఇంద్రభవనం మూవీలో కూడా కృష్ణతో కల్సి కృష్ణంరాజు నటించాడు. అదే సమయంలో ఇద్దరూ కల్సి కాంగ్రెస్ తరపున ఎంపీలుగా పోటీచేశారు. కృష్ణ ఏలూరు నుంచి గెలవగా, నరసాపురం నుంచి మాత్రం కృష్ణంరాజు ఓడిపోయారు. తర్వాత 1991మధ్యంతర ఎన్నికల్లో ఏలూరునుంచి మళ్ళీ బరిలో దిగిన కృష్ణ ఓడిపోయారు.