కృష్ణ,నాగేశ్వరరావు కాంబినేషన్ వచ్చిన సినిమాల్లో ఎన్ని హిట్స్ ఉన్నాయో ?

సూపర్ కృష్ణ కు ఎన్టీఆర్ అంటే అభిమానం అయినప్పటికీ మొదటగా అక్కినేని ద్వారానే ఎంట్రీ ఇచ్చాడు. అక్కినేని 60మూవీస్ చేసిన సందర్బంగా కృష్ణ చదువుతున్న కాలేజీకి అక్కినేని వచ్చినపుడు జనం తోపులాట చూసి హీరోకి ఇంతటి క్రేజ్ ఉంటుందా, అయితే నేనూ హీరో అవ్వాలని అప్పుడే అనుకున్నాడు. జగ్గయ్య నిర్మించిన పదండి ముందుకు మూవీలో కృష్ణ చిన్నవేషం వేసాడు. అలాగే అక్కినేని నటించిన కులగోత్రాలు మూవీలో కూడా చిన్న వేషం వేసాడు. అయితే ఆదుర్తి సుబ్బారావు కొత్త నటులతో సినిమా తీయాలని ఆడిషన్స్ చేసిన కమిటీలో అక్కినేని కూడా ఉన్నారు. ఆవిధంగా కృష్ణను ఎంపిక చేయడంలో అక్కినేని పాత్ర ఉంది. తేనెమనసులు షూటింగ్ 1964లో మొదలైనప్పుడు అక్కినేని,సావిత్రి కూడా వచ్చారు.

ఇక కృష్ణ హీరోగా నిలబడ్డాక మంచి కుటుంబం మూవీలో అక్కినేని అల్లుడిగా కృష్ణ నటించాడు. తర్వాత అక్కాచెల్లెలు మూవీలో అక్కినేనికి తమ్ముడిగా నటించాడు. పదేళ్ల తర్వాత హేమాహేమీలు మూవీలో కల్సి నటించారు. ఈ మధ్యలో కృష్ణ దేవదాసు మూవీ తీయడం,ఆ మూవీ కన్నా ముందే అక్కినేని దేవదాసు మళ్ళీ రిలీజ్ చేయడం వంటి పరిణామాల్లో ఇద్దరి మధ్యా దూరం పెరిగింది. ఇక హేమాహేమీలు మూవీలో ముందుగా శోభన్ బాబుని అనుకున్నారు. ఎందుకంటే వరుస ప్లాప్ లతో సతమతమవుతూన్న శోభన్ బాబు కృష్ణతో కల్సి సినిమా చేయాలని భావించి నటుడు కైకాల సత్యనారాయణ ద్వారా కబురు పెట్టడంతో కృష్ణ వెళ్లి సినిమా చేద్దాం అన్నారు.

కథ రెడీ అవుతున్న సమయంలో చేర్పులు మార్పులు అవుతున్నాయి. ఈలోగా మల్లెపూవు మూవీ హిట్ అవ్వడంతో శోభన్ బాబు కి ఇక మనతో చేయడని కృష్ణ అనుకున్నట్టే జరగడంతో , మరోపక్క ఎన్టీఆర్ తో మాటలు లేకపోవడంతో అక్కినేనిని సంప్రదించారు. అన్నపూర్ణ స్టూడియోలో సినిమా ,తన క్యారెక్టర్ బాగుండడం వంటి కారణాల వలన ఒకే చెప్పారు. ప్రేమాభిషేకంతో అక్కినేని,ఊరికి మొనగాడుతో కృష్ణ బాక్సాఫీస్ కొల్లగొడుతున్న సమయంలో వైజయంతి బ్యానర్ లో బాపయ్య డైరెక్టర్ గా గురు శిష్యులు మూవీ అక్కినేని,కృష్ణ కాంబోలో తీశారు. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక వీరిద్దరి కాంబోలో దాసరి నారాయణరావు తీసిన ఊరంతా సంక్రాంతి మూవీ వచ్చింది. ఇక ఎన్టీఆర్ సీఎం గా ఉండగా, అక్కినేని సీఎం పాత్రలో కృష్ణ పోలీసు పాత్రతో రాజకీయ చదరంగం మూవీ వచ్చింది. అయితే ఈమూవీ ఆడియన్స్ ఆదరణ పొందలేక పోయింది.

error: Content is protected !!