Healthhealth tips in telugu

కిడ్నీలో రాళ్లను సులభంగా కరిగించే అద్భుతమైన టిప్స్

kidney stones treatment In Telugu : ఈ రోజుల్లో మారిన జీవన శైలి కారణంగా చాలా చిన్న వయసులోనే కిడ్నీలో రాళ్ల సమస్య వస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఆపరేషన్ చేసి తొలగించిన మళ్లీ మళ్లీ వస్తూ ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడితే ఆ ప్రభావం మూత్రపిండాల మీద పడుతుంది.

ఆపరేషన్ అవసరం లేకుండా చిన్న చిన్న ఇంటి చిట్కాల ద్వారా మూత్రపిండాల్లో రాళ్లను కరిగించుకోవచ్చు. రోజుకి మూడు లీటర్ల నీటిని తాగుతూ ఉండాలి. తులసి కిడ్నీలో రాళ్లను తొలగించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. గుప్పెడు తులసి ఆకులను తీసుకుని రసం తీసి దానిలో తేనె కలిపి తీసుకోవాలి.

ఈ విధంగా ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటే క్రమంగా కిడ్నీలో రాళ్లు కరుగుతాయి. కిడ్నీ బీన్స్ ఆహారంలో భాగంగా చేసుకుంటే కిడ్నీలో రాళ్లను కరిగించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ప్రతిరోజు దానిమ్మ రసాన్ని తీసుకుంటే క్రమంగా కిడ్నీ లో రాళ్ళు కరిగిపోతాయి. దానిమ్మలో ఉన్న లక్షణాలు కిడ్నీ లో రాళ్ళను క రిగిస్తాయి.

ప్రతిరోజు భోజనానికి ముందు ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగాలి. ఈ చిట్కాలను పాటిస్తే కిడ్నీ లో రాళ్ళు కరిగిపోతాయి. అయితే ఇంటి చిట్కాల ద్వారా కిడ్నీలో ఉండే చిన్న చిన్న రాళ్ళు మాత్రమే కరుగుతాయి. పెద్ద రాళ్ళు ఉంటే మాత్రం డాక్టర్ సూచించిన ప్రకారం మందులు వాడవలసిందే.