సింహ సినిమా వెనక కొన్ని నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో ?
లక్ష్మి నరసింహ తర్వాత వరుసగా ఆరేళ్లపాటు నందమూరి బాలకృష్ణ సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి ప్లాప్ అవ్వడంతో ఫాన్స్ లో నిరాశ అలుముకుంది. సరిగ్గా అలాంటి సమయంలో నందమూరి నటసింహం విశ్వరూపాన్ని చూపిస్తూ బోయపాటి శ్రీను తీసిన సింహా మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. అభిమానుల దాహాన్ని తీర్చింది. వరుస ప్లాప్ ల నేపథ్యంలో అప్పటికే భద్ర,తులసి సినిమాలు చేసిన బోయపాటి పేరు బాలయ్యకు కొందరు సూచించారు. ముత్యాల సుబ్బయ్య తీసిన తొలిప్రేమకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన బోయపాటితో పరిచయం ఉండడంతో వెంటనే ఫోన్ కొట్టారు. అయితే విజయవాడ పెళ్ళిలో ఉన్న బోయపాటి మర్నాడు వచ్చి బాలయ్యను కలిసాడు. కథలు ఉన్నాయా అని అడగడం ఓ కథ చెప్పడంతో మూడు రోజుల్లో నిర్ణయం చెబుతానని బాలయ్య అన్నాడు.
మొత్తానికి సినిమా చేస్తున్నాం, పూర్తి కథ రెడీ చేయమని బోయపాటికి బాలయ్య చెప్పేసాడు. తొడ గొట్టడాలు,భారీ డైలాగులు,సుమోలు పైకి లేవడం వంటివాటివి లేకుండా కథను తీర్చిదిద్ది 24నిమిషాల్లో వినిపించడం ఒకే చేయడం అయింది. దీంతో నయనతార, స్నేహ ఉల్లాల్ లను హీరోయిన్స్ గా సెలెక్ట్ చేసారు. చక్రి మ్యూజిక్. 120రోజుల షెడ్యూల్ కి గాను,112రోజుల్లోనే పూర్తిచేశారు. ముఖ్యంగా నయనతార బిజీ వలన 25 రోజుల షెడ్యూల్ ఇవ్వగా 19రోజులకే పూర్తిచేశారు. దాంతో 19రోజులకే రెమ్యునరేషన్ తీసుకుంది ఆమె. బోయపాటి గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడం వలన డాక్టర్ కోడెల శివప్రసాదరావు ను దృష్టిలో ఉంచుకుని ఈ కథ రాశారట. అందుకే ఈ సినిమా బాలయ్య ఫాన్స్ కి స్వీటీ మెమరీ.
డాక్టర్ కోడెల చేసిన మంచి పనులను జోడిస్తూ, డాక్టర్ నరసింహ పాత్రను తీర్చిదిద్ది 16కోట్ల రూపాయలతో సినిమా తెరెకెక్కించారు.2010 ఏప్రియల్ 30న భారీ అంచనాలతో సింహా విడుదలయింది. స్టైలిష్ గా ఫ్యాక్షన్ సినిమా తీయడంతో ఫాన్స్ కి బాగా నచ్చేసింది. ఊరికోసం శత్రు సంహారం చేసి, బిడ్డను తల్లికి అప్పగించి భార్యతో సహా వెళ్ళిపోతాడు. అయితే శత్రు శేషం వెతుక్కుంటూ రావడంతో నాన్న గురించి తెలుసుకుని ఏంచేసాడన్నది క్లైమాక్స్. బాలయ్య డైలాగ్ విధానం చాలా కూల్ గా ఈ సినిమాతో మారింది. పోలీస్, కుట్లు వేయడమే కాదు, పోట్లు కూడా వేస్తాను, చూడు ఒకవైపే చూడు, రెండోవైపు చూడాలనుకోకు వంటి డైలాగ్స్ పేలాయి. సాంగ్స్ కూడా అదిరిపోయాయి. 300సెంటర్స్ లో 50రోజులు ఆడింది. 92సెంటర్స్ లో 100రోజులు ఆడింది. ఉత్తమ నటుడిగా బంగారు నంది అవార్డుని బాలయ్య అందుకున్నాడు. అలాగే చక్రికి, ఝాన్సీకి కూడా నంది అవార్డులు వచ్చాయి.