వెంకీ మూవీలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టుని గుర్తు పట్టారా .. ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా ?

వినవయ్యా రామయ్యా సినిమాతో టాలీవుడ్ లో 2015 లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ అన్వేష్ బాగానే నటించాడు. ఇక ఈ సినిమాలో అతడికి జోడీగా దృశ్యం సినిమాలో వెంకటేష్ పెద్ద కూతురు గా చేసిన కృతిక జయకుమార్ చేసింది. ఆ తర్వాత 2017 లో ఏంజెల్ సినిమాలో నాగ అన్వేష్ నటించాడు. ఈ సినిమాలో హెబ్బా పటేల్ హీరోయిన్ గా చేసింది. ఈ రెండు మూవీలు పెద్దగా ఆడకపోయినా, నాగ అన్వేష్ నటన బాగానే ఆకట్టుకుంది.

ఇంతకీ నాగ అన్వేష్ ఎవరో తెలుసా? ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా అదరగొట్టాడు. వివరా ల్లోకి వెళ్తే , ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసాడు. విక్టరీ వెంకటేష్ నటించిన హిట్ మూవీస్ లో ప్రధానంగా చెప్పుకునే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ చేసారు. ఈ సినిమాకి ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ చేసాడు. విక్టరీ వెంకటేష్, సౌందర్య, వినీత, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం తమ నటనతో సినిమాను పండించారు.

ఇక ఈ మూవీలో వెంకటేష్ – వినీత కొడుకు గా నటించిన కుర్రాడు కూడా నటన కూడా సూపర్భ్. అంత చిన్న వయసులో కూడా ఎంతో బాగా నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆ కుర్రాడే నాగ అన్వేష్. నిజానికి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా తర్వాత కొన్ని సంవత్సరాల వరకు నాగ అన్వేష్ సినిమాల్లో కనిపించలేదు. సడన్ గా పెద్దయ్యాక హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.