Beauty Tips

దంతాలు బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని పాటించాల్సిందే

Oral Health Tips :దంతాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. దంతాల విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ పెట్టిన అనారోగ్య సమస్యలు తెచ్చుకున్నట్టే. కాబట్టి దంతాలను దృఢంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దాని కోసం కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. మంచి టూత్ పేస్ట్ ఎంపిక చేసుకోవాలి. రోజుకి రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి. చాలా మంది రోజులో ఎక్కువ సార్లు కాఫీ తాగుతూ ఉంటారు. ఎక్కువ సార్లు కాఫీ టీ తాగితే చిగుళ్ళు దంతాలు దెబ్బ తింటాయి.

ఈ సమస్య లేకుండా ఉండాలి అంటే కొంత శ్రద్ధ పెట్టాలి. దంతాలు బలంగా ఆరోగ్యంగా ఉండటానికి అరటిపండు తొక్క బాగా సహాయపడుతుంది. అరటిపండు తొక్కతో దంతాలను ఒక నిమిషం పాటు రుద్దాలి ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన అరటి తొక్క లో ఉండే మా మాంగనీస్,మెగ్నీషియం, పొటాషియం పళ్ళ పై పేరుకుపోయిన మలినాలు గారను తొలగిస్తుంది. అలాగే కూల్ డ్రింక్స్ పంచదార తో తయారైన స్వీట్స్ వంటి వాటికి కాస్త దూరంగా ఉండాలి.