ఇమ్యూనిటీ పెంచే అద్భుతమైన పళ్ళు…మీరు తింటున్నారా ?

Corona immunity Fruits :ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రతి ఒక్కరూ శరీరంలో ఇమ్యూనిటీ పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. చలికాలం ప్రారంభం అవడంతో ఈ మహమ్మారిని అడ్డుకోవాలి అంటే తప్పనిసరిగా ఇమ్యూనిటీ పెంచుకోవాలి. నిపుణులు ప్రతిరోజు కొన్ని పండ్లను తీసుకుంటే immunity పెరుగుతుందని చెబుతున్నారు. నారింజ వంటి సిట్రస్ జాతికి చెందిన పండ్లను తీసుకుంటే ఇమ్యూనిటీ అధికంగా వస్తుంది.

ప్రతి రోజూ నారింజ పండు జ్యూస్ రూపంలో తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. రోజుకు ఒక యాపిల్ తింటే యాపిల్ లో ఉండే విటమిన్ సి విటమిన్ ఏ జీర్ణక్రియను మెరుగుపరచడంలో కాకుండ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇక దానిమ్మ విషయానికొస్తే రక్తంలోని హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతూ శరీరంలో ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తుంది.జామ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పండ్లను తీసుకుంటూ ఉంటే మన శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.