కరోనా ఇమ్యూనిటీ ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా…షాకింగ్ నిజం

Corona immunity power :కంటికి కనిపించని అంతుచిక్కని కరోనా మహమ్మారి వచ్చి దాదాపుగా 8 నెలలు కావస్తోంది. దీని ప్రభావం మానవ జీవితం మీద ఎలా ఉంటుందో పరిశోధన చేస్తున్నారు. కరోనా అంతం కోసం వ్యాక్సిన్ తయారీలో శాస్త్రవేత్తలు బిజీ ఉన్నారు. అయితే కరోనా వచ్చి తగ్గిన వారిలో ఇమ్యూనిటీ ఎలా ఉంటుందో పరిశోధకులు చెపుతున్నారు. ఒక్కసారి కరోనా వచ్చి తగ్గిన వారిలో ఇమ్యూనిటీపవర్ దాదాపుగా ఆరు నెలల పాటు ఉంటుందని తాజా పరిశోధనలో తెలిసింది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కొంత వరకు ఇది ఒక శుభవార్తే అని చెప్పవచ్చు.

అయితే కరోనా గురించి జరిగిన పరిశోధనలు చాలా తక్కువ. ఈ వ్యాధి గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అంటున్నారు. immunity పవర్ గురించి కూడా ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది.