చైతన్య సమంత ఎవర్ని ఫాలో అవుతున్నారో తెలుసా ?

Naga chaitanya follows Ram Charan :అక్కినేని మనవడిగా నాగార్జున కొడుకుగా జోష్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందాడు. నాగ చైతన్య స్టార్ హీరోయిన్ సమంత ప్రేమలో పడి 2017 వ సంవత్సరం లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి జరిగి దాదాపుగా మూడు సంవత్సరాలు అయినప్పటికీ పిల్లల గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదట. ఈ విషయంలో లో ఈ జంట రామ్ చరణ్ ఉపాసన దంపతులను ఫాలో అవుతున్నారు. వీరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నాగచైతన్య దంపతులు కూడా ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారని ఓ సందర్భంలో తెలిపారు.

ఈ మధ్య నాగచైతన్య, సమంత ఇద్దరూ కలిసి ఓ యాడ్ షూటింగ్ సందర్భంగా అందులో సమంత ఇద్దరు పిల్లల డ్రెస్ ఫోటోలను చూపించి ఎంతో క్యూట్ గా ఉన్నారని అనగా.అందుకు నాగ చైతన్య స్పందిస్తూ ఇప్పుడు అలాంటివేమీ ప్లాన్ చేయకు అని చెప్పడం ద్వారా వారి ఇప్పుడే పిల్లలను వద్దనుకుంటున్నారని పరోక్షంగానే నాగ చైతన్య చెప్పేశారు.