Uncategorized

దంతాల మద్య దాగి ఉన్న గారను, పాచినీ తొలగించటానికి చిట్కాలు

Remove Teeth Plaque :దంతాల మద్య లేదా దంతాల వెనుక దాగి ఉన్న గారను, పాచినీ తొలగించుకోవడానికి ప్రతి నెలా డెంటిస్ట్ ను కలుస్తున్నారా…? అయినా ఎటువంటి ఫలితం లేదా …అయితే ఈ దంత సమస్యలను నివారించడానికి కొన్ని ఉత్తమ ఇంటి నివారణలు ఉన్నాయి. పళ్ళ మీద పాచి బాగా గారకట్టుకుపోవడం, చిగుళ్ళు వాచి ఎర్రబడడం, చిగుళ్ళ వెంబడి రక్తం కారటం మొదలైనవన్నీ చిగుళ్ళ రోగ లక్షణం.

ఈ సమస్యలకు గురికాకుండా ఉండాలంటే మొదట ఎప్పటికప్పుడు దంతాల మద్య ఏర్పడే పాచిని డెంటిస్ట్ అవసరం లేకుండా నేచురల్ పద్దతుల్లో తొలగిస్తుండాలి. అదెలాగో కొన్ని సింపుల్ చిట్కాలను తెలుసుకుందాం.

లవంగాలు
కొన్ని లవంగాలను పౌడర్ చేసి, అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను దంతాలకు అప్లై చేసి, దీన్ని టూత్ బ్రష్ తో బ్రష్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే పండ్ల మద్య ఉన్న పాచిని నేచురల్ గా తొలగించుకోవచ్చు.

స్ట్రాబెర్రీస్
స్ట్రాబెర్రీస్ బెస్ట్ నేచురల్ హోం రెమెడీ . ఇది దంతాలను నేచురల్ గా శుభ్రం చేస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా ఫ్రెష్ గా ఉండే స్ట్రాబెర్రీ పండ్లను తీసుకొని వాటితో దంతాలను, చిగుళ్లను రుద్దాలి . కొద్దిసేపు ఇలా మర్దన చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో గార్గిలింగ్ చేసి నోటిని శుభ్రం చేసుకోవాలి.

బేకింగ్ సోడా:
బేకింగ్ సోడా ఒక ఓల్డెస్ట్ కిచెన్ పదార్థం. పాచిని తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది బేకింగ్ సోడాను బ్రెష్ తో అద్ది దంతాల మీద రుద్దాలి. చాలా కొద్ది సమయంలోనే దంతాల మద్య పాచీ లేకుండా మీరు చూడగలరు.

కొత్తిమీర:
క్యావిటీ సమస్యను కొత్తిమీర తగ్గిస్తుందంటే మీరు నమ్ముతారా. దంతాల వెనుక దాగున్న పాచీని నేచురల్ గా తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కొత్తిమీర వాటర్ తో గార్గిలింగ్ చేసినా మంచి ఫలితం ఉంటుంది.

కమలా/బత్తాయి పండు తొక్కలు :
తొక్కలను ఎండబెట్టి, పౌడర్ గా చేసి, దానికి కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి దంతాలకు అప్లై చేసి మసాజ్ చేసి బ్రష్ చేయాలి. ఇలా చేయడం వల్ల నేచురల్ గా పాచిని తొలగించుకోవచ్చు. ఈ పద్దతిని వారంలో రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరినూనె
కొబ్బరినూనెలో ఉండే లారిక్‌యాసిడ్ దంతాలపైన బాక్టీరియాలు చేరడానికి దారితీసే పాచి వంటి వలయాన్ని నిర్మూలించడానికి ఉపయోగపడ్తుంది. అదేవిధంగా దంతాలు చెడు వాసన రాకుండా శుభ్రంగా ఉంచుతుంది. రోజూ ఉదయాన్నే బ్రష్ చేసుకునే ముందు కొంచెం కొబ్బరినూనెను వేలితో దంతాలను రుద్దాలి. కొబ్బరినూనెను మింగకుండా జాగ్రత్త పడాలి. తరువాత దంతాలను నీళ్ళతో శుభ్రంచేసుకుని బ్రష్ చేసుకోవాలి.

టమోటోలు:
టమోటోల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మౌత్ వాష్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తాయి. వీటిని మనం డైరెక్ట్ గా పళ్లను రుద్దేందుకు ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత బేకింగ్ సోడాతో చేసుకున్న మిశ్రమంతో వాష్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అలోవెర:
అలోవెరాలో యాంటీబ్యాక్టీరియల్ లక్షనాలుంటాయి కాబట్టి, అలోవెరా జెల్ తో దంతాల మీద రుద్ది తర్వాత బ్రెష్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.