ఈ కమెడియన్ హిస్టరీ తెలుసా…సినిమాల్లోకి రాక ముందు ఏమి చేసేవారో…?

Comedian Shankar melkot :హాస్య బ్రహ్మ జంధ్యాల డైరెక్షన్ లో ఉషాకిరణ్ మూవీస్ వారి శ్రీవారికి ప్రేమలేఖ మూవీ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ శంకర్ మేల్కొటి గురించి చెప్పాలంటే, చిన్నపాటి గడ్డంతో ఉంటారు. అన్ని సినిమాల్లోనూ అలాగే కనిపిస్తారు. నువ్వే కావాలి మూవీలో కోవై సరళతో కల్సి చేసిన హాస్య సన్నివేశాలు గుర్తుకి తెచ్చుకోవాల్సిందే

షుక్రియా అంటూ ఆ సినిమాలో వీరిద్దరూ పండించిన హాస్యం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. అయితే సినిమాల్లోకి రాకముందు శంకర్ మేల్కొటి ఉషాకిరణ్ మూవీస్ లో పనిచేసేవారు. చిట్ ఫండ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తూ ఉండగా, సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది. వెంటనే జంధ్యాలను సంప్రదించగా, శ్రీవారికి ప్రేమలేఖ మూవీలో ఛాన్స్ వచ్చేసింది.

ఇక అక్కడ నుంచి వెనుతిరిగి చూడలేదు. శంకర్ మేల్కొటి అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే వస్తున్నారు. దూకుడు, నువ్వు నాకు నచ్చావ్, సంతోషం, నేను వంటి సినిమాల్లో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 50సినిమాల్లో చేసారు. ఈయన అల్లుడు ఎంవివి శ్రీధర్ బోర్డు ఆఫ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో జీఎం గా చేస్తున్నారు. నటనకు మాత్రమే ప్రాధ్యాన్యతనిస్తూ పాత్రలువేస్తానని శంకర్ మేల్కొటి చెబుతుంటారు.