వంటలక్క ఒక్క ఎపిసోడ్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా…షాక్ అవ్వాల్సిందే

Karthika deepam Serial: కార్తీకదీపం సీరియల్ ఎంతటి ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 7:30 అయిందంటే అందరూ పనులు మానుకొని మరీ టీవీ దగ్గర సెటిల్ అవ్వాల్సిందే. ఈ సీరియల్ టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఈ ఒక్క సీరియల్ దెబ్బతో మిగతా చానల్స్ వారికి పోటీ పెరిగింది అంటే ఈ సీరియల్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీరియల్ లో దీప అలియాస్ వంటలక్క క్యారెక్టర్ అందర్నీ కట్టిపడేసింది అని చెప్పవచ్చు అంతలా కట్టిపడేసిన దీప ఈ సీరియల్ కు ఎంత పారితోషికం తీసుకుంటుందో అని సందేహం చాలా మంది అభిమానులకు ఉంది.

ఈ రోజు దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ సీరియల్ మలయాళంలో కారుముత్తు పేరిట ఏడు సంవత్సరాలు ప్రసారమైంది ఈ సీరియల్ లో దీప లీడ్ రోల్ పోషించింది.ఈ సీరియల్ కోసం దీప ఒక్క ఎపిసోడ్ కి 15000 రూపాయిలు తీసుకుంది. తెలుగులో అయితే దీప ఒక్కో ఎపిసోడ్ కు లక్ష రూపాయిలు తీసుకుంటుంది. ఇప్పుడు రెమ్యునేషన్ పెంచాలని దీప పట్టు పట్టిందట . ఒక్కో ఎపిసోడ్ కి అక్షరాల మూడు లక్షలు డిమాండ్ చేస్తోందట. దాంతో నిర్మాతలు కూడా ఓకే చెప్పేశారు అని సమాచారం. మరి సీరియల్ మొత్తాన్ని ఒంటి చేత్తో లాగిస్తున్న వంటలక్కకు ఆ మాత్రం ఇవ్వడం న్యాయమే అంటున్నారు ఆమె అభిమానులు.