హైపర్ ఆది సంపాదన,ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Jabardasth hyper aadi :ఈటీవీలో వస్తున్న జబర్దస్త్ ప్రోగ్రాం ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ అశేషమైన ఆడియన్స్ ఆదరణతో టాప్ రేటింగ్ తో దూసుకెళ్తూనే ఉంది. ఇందులో కంటెస్టెంట్స్ జనంలో పాపులార్టీ సంపాదించడంతో పాటు ఆర్ధికంగా కూడా బాగానే ఎదిగారు. అలాగే పలు షోస్, సినిమాలు కూడా చేస్తూ, రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇందులో హైపర్ ఆది అయితే బాగానే కూడబెట్టాడు. పంచ్ డైలాగులకు కేరాఫ్ అడ్రస్ గా, సెటైర్లకు బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు పొందిన ఆది చాలా తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగాడు.

అయితే జబర్దస్త్‌కు రాకముందు హైపర్ అది కుటుంబ పరిస్థితి దారుణంగా ఉండేదట. మిడిల్ క్లాస్ కుటుంబం నుంచే వచ్చాడు. ఇండస్ట్రీకి రాకముందు సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేసాడు. అలీతో సరదాగా షో లో ఈ విషయాలు వెల్లడించాడు. అప్పట్లో తను, తన ఇద్దరు అన్నయ్యల చదువు కోసం తండ్రి ఆస్తులు అన్నీ అమ్మే యడంతో చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉన్నామని గుర్తు చేసుకున్నాడు. తమకు ఊళ్ళో 3 ఎకరాల పొలం ఉండేదని, దాన్ని కూడా తమ కోసమే నాన్న అమ్మేసాడని వివరించాడు. బిటెక్ చదివిన తాను ఇలా జబర్దస్త్‌లోకి వెళ్లడం చాలా మందికి నచ్చక తిట్టేవారని చెప్పుకొచ్చాడు.

అయితే ఛాన్స్ కోసం వేచి చూస్తున్న తనకు ఛాన్స్ రావడంతో వదల్లేదని, పగలు రాత్రి తేడా లేకుండా స్క్రిప్ట్ రాసుకునేవాడినని ఆది వివరించాడు. మొదట్లో రైటింగ్ సైడ్ వెళ్లి అక్కడ కొన్ని సంస్థలకు పని చేసాక, అభి పరిచయంతో జబర్దస్త్‌లోకి వచ్చాడు. ఇండస్ట్రీ దయతోనే ఎక్కడైతే తన ఆస్తులు పోయాయో అక్కడే తిరిగి సంపాదించుకున్నానని, సొంతూళ్లో నాన్న అమ్మేసిన 3 ఎకరాల స్థలం స్థానంలో ఇప్పుడు 10 ఎకరాలు కొన్నానని, సొంతూళ్లో పెద్ద ఇల్లు కూడా ఉందని చెప్పుకొచ్చాడు. కాగా కొన్ని ఎపిసోడ్స్ తర్వాత ఆది కాస్తా హైపర్ ఆది అయ్యాడు. అప్పుడప్పుడూ వివాదాలు చుట్టుముట్టినా తన కామెడీతో అందర్నీ నవ్విస్తూ, తనదైన మార్క్ పంచులతో ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటున్నాడు.