Movies

సోనూసూద్ హీరోగా సక్సెస్ కాకపోవటానికి కారణాలు ఇవే?

sonu sood :అరుంధతి మూవీలో వదలబొమ్మాళి అంటూ అందరినీ భయపెట్టిన విలన్ సోనూసూద్ లాక్ డౌన్ కారణంగా ఒక్కసారిగా రియల్ హీరో అయ్యాడు. ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన్ని దేవుడుగా కొలిచేలా చేశాయి. అయితే ఈయన గురించి పరిశీలిస్తే విలక్షణ నటుడు. విజయకాంత్ హీరోగా ఓ తమిళ సినిమాలో విలన్ కేరక్టర్ కోసం ఏకంగా గుండు కొట్టించుకున్నారు.

హేట్సాఫ్ అనే తెలుగు చిత్రంలో ఎంట్రీ ఇచ్చి నెగెటివ్ పాత్రలో సోనూసూద్ నటించారు. అతడు, సూపర్ మూవీస్ 2005లో విడుదలై ఈయన కెరీర్ ని మలుపు తిప్పాయి. అరుంధతి మూవీలో పశుపతి పాత్రతో విలనిజం పండించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇక హాలీవుడ్ లో లెజండరీ నటుడు జాకీచాన్ తో కల్సి నటించి ఆకట్టుకున్నారు. నిజానికి పోకిరి మూవీని సోనూసూద్ ని దృష్టిలో పెట్టుకుని పూరి జగన్నాధ్ కథ రాశారట.

ఆ మూవీలో సోనూసూద్ నటించి ఉంటే స్టార్ హీరో అయ్యేవారు. కరోనా రోగులకు సోనూసూద్ తన ఖరీదైన హోటల్ ని కేటాయించి మానవత్వాన్ని చాటారు. తండ్రి పేరుతొ శక్తి నగర్ అనే సంస్థను నెలకొల్పి యోగ, తుటక్ తుటక్, టుటియా వంటి సినిమాలు తీశారు. బాడ్మింటన్ స్టార్ సింధు బయోపిక్ ని కూడా తెరకెక్కించ బోతున్నారు. ఆరోగ్యంపై అమితమైన శ్రద్ధ చూపించే మందు, ధూమ పానం జోలికి అసలు వెళ్లరట. అంతేకాదు, శాఖాహారమే తీసుకుంటారట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."