MoviesTollywood news in telugu

గృహలక్ష్మి చైల్డ్ ఆర్టిస్ట్ లక్కీ ఎవరి కొడుకో తెలుసా ?

Intinti Gruhalakshmi Serial :జనాలు టివి సీరియల్స్ బాగానే చూస్తున్నారు. అందుకే కొన్ని సీరియల్స్ కి మంచి రేటింగ్ తో దూసుకెళ్తున్నాయి. అందులో నటించే నటీనటులకు కూడా మంచి గుర్తింపు వస్తోంది. అలాగే గృహలక్ష్మి సీరియల్ కూడా మంచి ప్రేక్షకాదరణతో నడుస్తోంది. ఈ సీరియల్ లో లాస్య కు కొడుకుగా నటిస్తున్న లక్కీ చిన్న వయస్సులోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

లక్కీ అసలు పేరు అద్వైత్. యితడు నవంబర్ 11న జన్మించాడు. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం వలన 5ఏళ్ళ వయస్సు నుంచే స్టేజ్ మీద ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. యాక్టింగ్ మీద కూడా మక్కువ ఉండడంతో పేరెంట్స్ ఎంకరేజ్ మెంట్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు. 2019లో డాన్స్ కి ఉగాది బాల పురస్కారం అందుకున్నాడు.

అగ్నిసాక్షి సీరియల్ లో శంకర్ కి కొడుకుగా నటించి, తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సీరియల్ లో చేసిన నటనకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టు అవార్డు అందుకున్నాడు. కోయిలమ్మ ,సిరిసిరి మువ్వలు,బంగారు పంజరం, గృహలక్ష్మి వంటి సీరియల్స్ లో నటిస్తూ తన ముద్దు ముద్దు మాటలతో ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. మరో కొత్త సీరియల్ లో కూడా కనిపించబోతున్నాడట.